హైదరాబాద్ లో ఫిబ్రవరి 2న జరిగిన  గ్రేటర్ పోలింగ్ ఉదయం మొదలై మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా సాగినా..పాతబస్తీలో కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తలు సీనియర్ నేత షబ్బీర్ అలీ పై దాడి చేశారు. ఉత్తమ్ కుమార్ కారు అద్దాలు పగుల గొట్టారు..అక్కడ పెద్ద యుద్దవాతావరణమే నెలకొంది. దీంతో అక్కడ రీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల నేపథ్యంలో పురానాపూల్ డివిజన్‌లో నేడు చేపట్టిన రీపోలింగ్ ప్రారంభమైంది.

పురానాపూల్‌లోని 36 కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. 34, 410 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 36 బూత్ లతో మొత్తం 34, 413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుంది.

మరోవైపు గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం మధ్యహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానుంది. కాగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. 34, 410 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ విధుల్లో 225 మంది సిబ్బంది పాల్గొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: