విశాఖ సాగరతీరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ప్లీట్ రివ్యూ కు రంగం సిద్దమయింది. ఈ ప్లీట్ రివ్యూలో 27 దేశాలకు సంబంధించిన 80 వివిధ యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. ఈ రోజు గవర్నర్ నరసింహన్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను లాంఛనంగా ప్రారంభిస్తారు. నావికా దళాల కవాతు, సాహస విన్యాసాలు సందర్శకుటను కట్టిపడేశాయి. యుద్ధనౌకల నమూనాలతో కూడిన శకటాలు..సముద్రంలో విద్యుద్ధీపాలతో అలంకరించిన యుద్ధనౌకలు ప్రజలను మంత్ర ముగ్ధుల్ని చేశాయి. ఐదురోజులపాటు జరిగే నావికా దళాల కవాతు,సాహస విన్యాసాలు సందర్శకులను విపరీతంగా ఆకట్టుకొన్నాయి.


ఈ వేడుకల్లో వివిధ దేశాలకు చెందిన, భారతీయ నౌకా దళానికి సంబంధించిన నౌకలు, జలంతర్గాములు, విమానాలు, హెలికాఫ్టర్ల విన్యాస ప్రదర్శన అలరించింది. ఉగ్రవాదులు దేశంలో చొరబడేందుకు సముద్ర మార్గానే్న ఎంచుకుంటున్నారు. పశ్చిమ తీరంలో ఇటువంటి చేదు అనుభవాన్ని మనం చవి చూశాం. ఇటువంటి పరిస్థితుల్లో తీర భద్రతపై మనం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం. పశ్చిమ తీరాన్ని శత్రు దుర్బేధ్యంగా మార్చిన తరువాత, ఇప్పుడు భారత ప్రభుత్వం తూర్పు తీర పటిష్ఠతపై దృష్టి కేంద్రీకరించింది.

సముద్రతీరంలో ఆరు లేన్లలో బారులుతీరిన యుద్ధ నౌకలను రాష్టప్రతి ప్రణబ్ సమీక్షిస్తారు. ఆకాశమార్గంలో 70 దేశ, విదేశీ విమానాలు విన్యాసాలు పరిశీలిస్తారు. భారత నౌకాదళానికి చెందిన ఎజెటి హక్122, టియు 142, డోర్నియర్‌లు, చేతక్, డోర్నియర్లు, సారంగ్ హెలికాప్టర్లు అలరించనున్నాయి.

హెలికాప్టర్ విన్యాసాలు


రష్యా, చైనా, కెనడా, ఆంటిగ్వా, బంగ్లాదేశ్, మైన్మార్, జపాన్, ఇండోనేషియా, టర్కీ ఆస్ట్రేలియా, ఒమన్, సౌదీ నుంచి నౌకలు వస్తున్నాయి.  గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2016 ను భారీస్థాయిలో నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో 50 దేశాలు పాలుపంచుకొంటున్నాయి.ఈ వేడుకను గతంలో 2001 జనవరిలో నిర్వహించగా, అందులో 29 దేశాలు పాల్గొన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: