ఉన్నత చదువులు చదువుకోవడానికి విద్యార్థులు విదేశాలకు వెళ్లడం తెలిసిన విషయమే..భారతీ విద్యార్థులు ఇతర దేశాలకు వెళితే..అక్కడి విద్యార్థులు భారత్ రావడం కామన్. అయితే భారత్‌కు వచ్చిన ఓ టాంజానియా యువతికి ఘోర అవమానం ఎదురైంది.స్థానికంగా జరిగిన ఓ రోడ్డుప్రమాదానికి నువ్వే కారణమంటూ ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. తనకేపాపం తెలియదని ఆమె ప్రాధేయపడ్డా వినలేదు. బెంగళూరు శివారులోని హేసరఘట్ట రోడ్డులో ఓ కారు వేగంగా వచ్చి 35ఏండ్ల మహిళను ఢీకొంది. ప్రమాదానికి నువ్వే కారణమంటూ ఆమెపై స్థానికులు కొందరు విచక్షణారహితంగా దాడిచేశారు. బట్టలిప్పి పరుగులుతీయించారు.

తనకేపాపం తెలియదని, తాను ప్రమాదాన్ని చూసేందుకే వచ్చానని చెప్పినా వారు ఆలకించలేదు.తీరా.. ప్రమాదానికి సూడాన్‌కు చెందిన యువకుడు కారణమని తేలడంతో టాంజానియా యువతిని, ఆమె స్నేహితులను వదిలిపెట్టారు. తాను చదువుకోవడానికి బెంగళూరుకు వచ్చానని, స్థానికంగా ఓ కళాశాలలో బీబీఎం చదువుతున్నట్లు బాధితురాలు మీడియాకు తెలిపింది. దాడి జరిగినరోజే పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఢిల్లీలోని టాంజానియా రాయబార కార్యాలయం తీవ్రంగా స్పందించింది. పూర్తి వివరాలు వెల్లడించాలని, దాడికి పాల్పడ్డవారిని శిక్షించాలని డిమాండ్ చేసింది.  మరో వైపు బెంగళూరు శివారు ప్రాంతంలో టాంజానియా యువతిపై జరిగిన దాడి ఘటనపై ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి పరమేశ్వర్ వివరణ ఇచ్చారు.

యువతిని వివస్త్రను చేసి ఊరేగించారనే వార్తలను కొట్టిపడేశారు. ఈ వార్త అసత్యమని అన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను అరెస్టు చేశామన్నారు. ఈ ఘటనపై విదేశాంగ శాఖకు సమాచారం అందించామని వివరణ ఇచ్చారు. తాజాగా బెంగళూరులో టాంజానియా యువతిపై దాడి జరిగిన ఘటన పెద్ద వివాదం చెలరేగుతుంది.  ఈ సంఘటనను టాంజానియా సర్కార్ సీరియస్‌ గా తీసుకోవటంతో విదేశాంగ శాఖ…ఇందులో జోక్యం చేసుకుంది.

టాంజానియా యువతి నడిపిన కారు దహనం


ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించారు.  భారత దేశంలోని ఆఫ్రికన్ విద్యార్థుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి వికాస్ స్వరూప్ భరోసా ఇచ్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: