తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంతటి ఉత్కంఠత రేపింది గ్రేటర్ ఎలక్షన్స్. 30 లక్షల మందికి పైగా ఓటర్లు ఢీ అంటే ఢీ అనే పార్టీలు వారి తలరాతలు  పోలయ్యే ఓట్ల తీరు ఎలా ఉండబోతోంది అన్న అంశంపై తెలుగు రాష్ట్ర ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రేటర్ ఎన్నికల ఫలితాల సమయం రానే వచ్చింది. మరికొన్ని గంటల్లోనే నాయకుల తలరాతల్ని బయటపెట్టబోతున్నాయి ఈవీఎంలు.

 గ్రేటర్ పీఠం మాదే అని చెప్పుకున్న టీఆర్ఎస్ అయినా..సత్తా చాటుతాం అని చెప్పుకుంటున్న బీజేపీ – టీడీపీ కూటమైనా పరువు దక్కించుకుంటామనుకుంటున్న కాంగ్రెస్ నేతలు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల నుంచి గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. రాత్రి 8 గంటల వరకు గ్రేటర్ ఫలితాల వెల్లడి ప్రక్రియ పూర్తి అవుతుంది. మొత్తం 150 డివిజన్లకు సంబంధించి 24 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపును చేపడుతున్నారు.

ఒక్కో కేంద్రంలో 6 నుంచి 10 డివిజన్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల విధుల్లో 5,626 మంది సిబ్బంది పాల్గొన్నారు. లెక్కింపు కేంద్రాల్లో 1674 టేబుళ్లను ఏర్పాటు చేసిన అధికారులు 827 రౌండ్లను చేపట్టనున్నారు. ఒక్కో రౌండ్‌కు 15 నిమిషాలు కేటాయించారు.  దత్తాత్రేయ నగర్, అక్బర్‌బాగ్. రెయిన్‌బజార్, నవాబ్‌సాహెబ్‌కుంట డివిజన్ల ఫలితాలు మొదటగా వెలువడనున్నాయి. కాగా చివరగా ఫలితాలు వెల్లడయ్యే డివిజన్లు ఈ విధంగా ఉన్నాయి. సరూర్‌నగర్, ఆర్‌కేపురం, చంపాపేట, గడ్డిఅన్నారం, యూసుఫ్‌గూడ, సనత్‌నగర్, మోండా మార్కెట్, కొత్తపేట. కాగా అన్నిటికంటే ఆఖరున వెల్లడయ్యేది పురానాపూల్ డివిజన్ ఫలితం.
మొత్తం సీట్లు  — 150గెలుపు  
టీఆర్99
టీడీపీ — బీజేపీ అలియన్స్
ఎంఐఎం44
కాంగ్రెస్2
ఇతరులు0



మరింత సమాచారం తెలుసుకోండి: