తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటాయో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గ్రేటర్‌లో అందరూ టీవీలకు అతుక్కుపోయారు. 5 గంటలు ఎప్పుడు అవుతుందని అందరూ ఆశగా ఉన్నారు. 150 డివిజన్లలో 1,333 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల అంతర్మథనం ఇదే. అధికార.. ప్రతిపక్ష పార్టీల నుంచి బరిలోకి దిగిన వారసులకు.. ఈ గెలుపు..తప్పనిసరిగా మారింది. భవిష్యత్తు రాజకీయాల్లో క్రియాశీలకంగా మారేందుకు కీలకమైంది. 


మొత్తం సీట్లు  — 150గెలుపు 
టీఆర్ఎస్99
టీడీపీ  బీజేపీ  అలయన్స్5
ఎంఐఎం44
కాంగ్రెస్2
ఇతరులు0


ఒకటి రెండు రోజుల్లో కార్పోరేటర్లతో సమావేశం.. మేయర్ అభ్యర్థిపై చర్చించనున్న కేసీఆర్


పురానాపూల్ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న రీపోలిగ్ ఓట్లు. రాత్రి 8 గంటల తర్వాతే పురానాపూల్ ఓట్ల లెక్కింపు


ప్రభుత్వ పనితీరుకు గ్రేటర్ ఫలితాలు నిదర్శనం : మంత్రి ఈటెల


జూబ్లీ హిల్స్ లో టీఆర్ఎస్ అభ్యర్థి కాజా సూర్యనారాయణ గెలుపు


తార్నక ఓట్ల లెక్కింపులో అక్రమాలు, ఇక్కడ రీకౌంటింగ్ జరిపించాలి : మాజీ మేయర్ కార్తీక్ రెడ్డి


అమీర్ పేటలో టీఆర్ఎస్ అభ్యర్థి శేషుకుమారి గెలుపు


ముసారాంబాగ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సునిత గెలుపు


రాత్రి 8 గంటల తర్వాత పురానాపూల్ ఓట్ల లెక్కింపు


యూసఫ్ గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ విజయం


జూబ్లీ హిల్స్ లో టీఆర్ఎస్ ఆధిక్యం


అడిక్ మెట్ లో టీఆర్ఎస్ అభ్యర్థి హేమలత గెలుపు


బాగా అంబర్ పేట లో టీఆర్ఎస్ అభ్యర్థి పద్మావతి గెలుపు


వివేకానందన

గర్ కాలనీలో టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీబాయి గెలుపు



ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అన్నవి సమంజసమని.. గెలిచినా.. ఓడినా.. తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యపై పోరాటం చేస్తామని టిడిపి లీడర్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


జంటనగరాలలో గులాబి జెండా రెపరెపలాడుతున్నది. కారు స్పీడ్ కు సైకిల్ తో సహా అన్ని పార్టీల డిపాజిట్ లు గల్లంతయ్యాయి.


పార్టీ విజయానికి దోహదం చేసిన నేతలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు : కేటీఆర్ 


తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తాం..ఈ విజయంతో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా నిలబడటానికి దోహదం చేసిన ప్రజలకు ఎల్లప్పుడు రుణపడి ఉంటాం 


కేసీఆర్ నేతృత్వంలో మరోసారి టీఆర్ఎస్ చరిత్ర సృష్టించింది , అపూర్వ విజయం అందించిన హైదరాబాదీలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న.. ఈ గెలుపు మా బాధ్యతలు మరింత పెంచింది..ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాం :  కేటీఆర్


ఇప్పటికైనా ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి : డీఎస్


గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దే గెలుపు : మంత్రి తలసాని



మన్సూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి గెలుపు


అంబర్ పేట్ లో టీఆర్ఎస్ అభ్యర్థి జగన్ విజయం


కొత్తపేట లో టీఆర్ఎస్ అభ్యర్థి సాగర్ విజయం


హయత్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి తిరుమల గెలుపు


బీఎన్ రెడ్డి నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీ ప్రసన్న గెలుపు


లింగోజిగూడ టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ విజయం


చైతన్యపురి టీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ గెలుపు


గడ్డి అన్నారం టీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్ విజయం


ముషీరా బాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి బాగ్యలక్ష్మి గెలుపు


కొండాపూర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి హమీద్ విజయం


చందానగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి కవితారెడ్డి గెలుపు


జాంబాగ్ డివిజన్ లో రీకౌంటింగ్


వెంగళరావు నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి కిలారి మనోహర్ గెలుపు


బేగంపేట లో టీఆర్ఎస్ అభ్యర్థి తరుణి గెలుపు


హఫీజ్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి పూజిత గెలుపు


నాగోల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సంగీత విజయం


సనత్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మిబాల్ రెడ్డి విజయం


మన్సూరాబాద్ లో టీఆర్ఎస్


చింతల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి రషీదా బేగం గెలుపు


బాలానగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి చారీ గెలుపు


మైలార్ దేవ్ పల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గెలుపు


రామచంద్రాపురంలో టీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య గెలుపు


చంపాపేట్ లో టీఆర్ఎస్ అభ్యర్థి రమణారెడ్డి గెలుపు


అనుకున్న స్థానాల్లో కనీసం కూడా సీట్లు రాకపోవడంతో  టీడీపీ భవనం ఖాళీ అయ్యింది.


వెస్లీ కాలేజీలో 9 డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్ జరిగింది. ఆ 9 డివిజన్లలో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించినట్టు తెలుస్తున్నది.


అఖండ మెజారిటీతో విజయం అధించిన హైదరాబాద్ ప్రజలకు కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు.


టిఆర్ఎస్ భవన్ లో పండగవాతావరణం నెలకొన్నది. గులామ్ చల్లుకుంటూ పండగ చేసుకుంటున్నారు.


ఎంఐఎం పది స్థానాల్లో విజయం సాధించి 24 చోట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నది.


అందిన సమాచారం ప్రకారం టిఆర్ఎస్ 29 స్థానాల్లో విజయం సాధించి 74 చోట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నది.


జెఎన్టీయూ పరిధిలోని ఒక్క కెపీహెచ్పీ తప్పించి అన్ని స్తానాలలోను టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది.


తెరాస 101, ఎంఐఎం 36, టిడిపి-బీజేపి 9, కాంగ్రెస్ 3 ఇతరులు ఒక చోట ఆదిక్యంలో ఉన్నారు


గచ్చీబౌలిలో టీఆర్ఎస్ అభ్యర్థి సాయిబాబా విజయం


జాంబాగ్ లో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి విక్రమ్ గౌడ్ ఓటమి


అంచనాలకు మించిన ఫలితాలు చవిచూస్తున్న టీఆర్ఎస్



సెలిలర్ల డివిజన్లలోనూ టీఆర్ఎస్ హవా


ఎంఐఎం మినహా కాంగ్రెస్, టీడీపీలకు డబుల్ డిజిట్ కూడా ఇప్పటి వరకు దాటలేదు.

 

మొత్తం 11 డివిజన్లలో టీఆర్ఎస్ అఖండ విజయం.. అధికార పార్టీకి దరిదాపుల్లో లేని ప్రతిపక్షాలు. గ్రెటర్ లో టీఆర్ఎస్ ప్రభంజనం


లలిత్ బాగ్ లో ఎంఐఎం అభ్యర్థి గెలుపు


రియాసత్ నగర్ లో ఎంఐఎం అభ్యర్థి ముస్తఫా బేగం గెలుపు


ఎర్రగడ్డలో ఎంఐఎం అభ్యర్థి షాహిన్ బేగం గెలుపు

 

గోషామహల్ లో బీజేపీ అభ్యర్థి గెలుపు


షేక్ పేట,డబీర్ పూరాల ఎంఐఎం అభ్యర్థులు గెలుపు


పటాన్ చెరువులో కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ యాదవ్ గెలుపు


అల్వాల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయశాంతి గెలుపు


హైదర్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి జానకిరామరాజ గెలుపు


జియా గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణ విజయం


తార్నాకలో టీఆర్ఎస్ అభ్యర్థి సరస్వతి గెలుపు, మాజీ మేయర్ బండా కార్తీకేయ రెడ్డి ఓటమి


ఖైరతాబాద్ లో పీజేఆర్ కుమార్తె టీఆర్ఎస్ అభ్యర్థి విజయారెడ్డి విజయం


గోల్నాకలో టీఆర్ఎస్ అభ్యర్థి పద్మ గెలుపు


హిమాయత్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి హేమలత విజయం


గుడి మల్కాపూర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాశ్ గెలుపు


గాజుల రామారంలో టీఆర్ఎస్ అభ్యర్థి శేషగిరి విజయం


బోరబండలో టీఆర్ఎస్ అభ్యర్థి ఫసియుద్దిన్ గెలుపు


నేరేడ్ మెట్ల లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం


తూర్పు ఆనందబాగ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు


సోమాజీ గుడలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయలక్ష్మి గెలుపు


మియాపూర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి మేక రమేష్ ఒక్క ఓటు తేడాతో విజయం


కుకట్ పల్లి లో టీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి సత్యనారాయణ విజయం


చాలా చోట్ల పూర్తి అయిన కౌంటింగ్..మరి కాసెపట్లో వెలువడనున్న గ్రేటర్ ఫలితాలు


తొలుగ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన సిబ్బంది. కొనసాగుతున్న ఈవీఎం ఓట్ల లెక్కింపు

 

 పురానాపూల్ లో 55 శాతం పోలింగ్ జరగడంతో ఎంఐఎం నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.


తెరాస పార్టీ అఖండ మెజారిటీతో గెలుపొందుతుందని పీజెఆర్ కూతురు, తెరాస పార్టీ నేత విజయారెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


కౌంటింగ్ సెంటర్ల నుంచి ఎవరూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న అధికారులు


చాలా చోట్ల పూర్తైన మూడు రౌండ్ల కౌంటింగ్


పురానాపూల్ రీపోలింగ్ తో ఎన్నికల ఫలితాలపై ఆంక్షలు.. పురానాపూల్ లో ఇప్పటికే 45% పూర్తి. సాయంత్రం 5 గంటల తర్వాత వెలువడనున్న ఫలితాలు


కౌంటింగ్ కేంద్రాల కు సెల్ ఫోన్ లను అనుమతించని పోలీసులు


పురానాపూల్ లో ఎన్నికల ప్రక్రియ ముగిసినట్టు తెలుస్తున్నది. 45% పోలింగ్ జరిగినట్టు సమాచారం.


అధికార పార్టీ టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లాలోని అన్ని డివిజన్లను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.  తెరాస పార్టీ చెప్తున్నట్టు అన్ని డివిజన్లు సొంతం చేసుకుంటుందా లేక ఏదైనా తేడా వస్తుందా అన్నది మరికాసేపట్లోనే తేలిపోతుంది.


మలక్ పెట్ ముంతాజ్ కాలేజీలో సాంకేతిక లోపంతో ఎన్నికల కౌంటింగ్ నిలిచిపోయింది


పురానాపూల్ లో కొనసాగుతున్న పోలింగ్, పురానాపూల్ లోని మ.3 గంటల వరకు 41.80 శాతం పోలింగ్


పలు కౌంటింగ్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి


మొదలైన ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు


ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి


కుకట్ పల్లి,శేరిలింగంపల్లి,ఎల్బీనగర్,కుత్బుల్లాపూర్, రాజేంద్ర నగర్ పరిధిలోని డివిజన్ల ఫలితాలపై ఆసక్తి


కొన్ని చోట్ల ముగిసిన తొలి రౌండ్ల లెక్కింపు.. మొదటగా 26 వార్డుల ఫలితాలు


ఈ గ్రేటర్ ఎలక్షన్లలో లో సీనియర్ నాయకుల వారసులు బరిలో ఉన్నారు. ఎలాగైనా వారసుల గెలుపుకోసం నాయకులు తీవ్రంగా కష్టపడ్డారు.


పురానా పూల్ లో రీ పోలింగ్ జరుగుతుండటం వలన ఫలితాలను 5 గంటల వరకు ప్రకటించకూడదని ఈసీ ఆదేశాలు జరీ చేసినా.. వాట్స్ ద్వారా ఎవరు ఆధిక్యంలో ఉన్నారు అనే విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి.

 

 


107107

మరింత సమాచారం తెలుసుకోండి: