గ్రేటర్ ఎన్నికల తుది ఫలితాలు వెలువడ్డాయి. ముందుగా ఊహించినట్టే టీఆర్ఎస్ కారు దూసుకుపోయింది. అన్నీ తానై పార్టీని నడిపించిన కేటీఆర్ పార్టీని అగ్రస్థానాన నిలబెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక స్థానాలు గెలుచుకున్న రికార్డు సృష్టించారు.

కొన్నాళ్లుగా మేయర్ పీఠాన్ని సంకీర్ణం ద్వారానే పంచుకుంటున్న పార్టీలకు ఇప్పుడు ఆ ఆగత్యం తప్పింది. మొత్తం 150 డివిజన్లలో 75 సీట్లు సాధిస్తే.. మేయర్ పీఠం దక్కుతుంది. కానీ టీఆర్ఎస్ ఏకంగా దాదాపు వంద స్థానాలు గెలుచుకుంది. కేవలం ఒకటి తక్కువగా సెంచరీ కొట్టేసింది.  

ఫలితాల జాబితా ఒకసారి పరిశీలిస్తే.. 

మొత్తం జీహెచ్ఎంసీ డివిజన్లు..      - 150

టీఆర్ఎస్ గెలుచుకున్నవి     -        99
ఎం.ఐ.ఎం గెలుచుకున్నవి     -        44
బీజేపీ గెలుచుకున్నవి         -          4
టీడీపీ గెలుచుకున్నవి         -          1
కాంగ్రెస్ గెలుచుకున్నవి       -           2

కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు గెలుచుకుంటే.. టీడీపీ మరీ దారుణంగా ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. కేపీహెచ్ బీ స్థానంలో కూడా టీడీపీ గెలవకపోయి ఉంటే.. సున్నా స్కోరుతో పరువుపోయేది. 



మరింత సమాచారం తెలుసుకోండి: