గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూసుకుపోవడంతో ఆ పార్టీకి చెందిన మీడియాలో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. తెలుగు మీడియాలో పార్టీల సొంత ఛానళ్లు జర్నలిస్టు విలువలను ఎప్పుడో గాలికి వదిలేసిన సంగతి తెలిసిందే. సాక్షి, టీన్యూస్, కొంతవరకూ ఏబీఎన్ ఛానళ్లు మీడియా సంస్థల విలేకర్లు జర్నలిస్టులుగా కాకుండా పార్టీ కార్యకర్తలుగా వ్యవహరించడం మామూలైపోయింది. 

రీసెంటుగా టీఆర్ఎస్ విజయం విషయంలోనూ అదే జరిగింది. గ్రేటర్ పరిధిలో టీడీపీకి అత్యంత ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. 150 స్థానాలున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కేవలం ఒక్కటంటే ఒక్కటే సీటు గెలుచుకోవడం ఆ పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బ తీసిందనే చెప్పాలి. మరి ప్రత్యర్థి పార్టీ ఈ విధంగా దెబ్బ తింటే ఇక టీన్యూస్ వంటి ఛానల్ ఊరుకుంటుందా.. 

చంద్రబాబు దీనంగా ఉన్న దృశ్యాలకు.. నారాయణ మూర్తి పాట ఏమున్నదక్కో.. ఏమున్నదక్కా... పాటను జోడించి తన క్రియేటివిటీ చూపించింది. అలాగే బీజేపీ పార్టీ కిషన్ రెడ్డిని చూపిస్తూ ఆ పార్టీ ఎన్నికల గుర్తు కమలాన్ని సింబాలిక్ గా తీసుకుని.. రాలిపోయే పువ్వా.. నీకు రాగాలెందుకే.. అంటూ పాటను వినిపించింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూపిస్తూ ఆశా నిరాశేనా.. ఈ బతుకింతేనా అనే ఓ పాత పాటను చూపించారు.

ఇక చివరగా టీఆర్ఎస్ గెలుపు దృశ్యాలకు చిరంజీవి ముఠా మేస్త్రిలోని ఈ పేటకు నేనే మేస్తిరి.. అంటూ హుషారైన పాటను జోడించారు. ఈ వీడియోను పదే పదే ప్లే చేస్తూ టీ న్యూస్ జర్నలిస్టులు తమ విజయానందం ప్రజలకు చేరవేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: