ఔను.. మీరు చదివింది నిజమే.. చంద్రబాబు స్వయంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాడు. చంద్రబాబు ఏంటి.. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించం ఏంటి అనుకుంటున్నారా.. రాజకీయాల్లో ఒక్కోసారి అలాగే జరుగుతాయి. గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపుకోసం చంద్రబాబు రెండు రోజుల పాటు విపరీతంగా శ్రమించి ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. 

ఆయన తన ప్రచారాన్ని హైదరాబాద్ శివార్లలోని పటాన్ చెరును ప్రారంభించారు. ఇంటి నుంచి నేరుగా పటాన్ చెరు వెళ్లి అక్కడ ప్రచారం ప్రారంభించి.. అక్కడ నుంచి సిటీలోకి  ఎంటరయ్యారు. మదీనాగూడా, మియాపూర్ మీదుగా ప్రచారం సాగించారు. చంద్రబాబు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో తొలిసారి అడుగు పెట్టిన పటాన్ చెరులో టీడీపీ  దారుణంగా  ఓడిపోయింది.

అక్కడ కనీసం రెండో స్థానంలో కూడా టీడీపీ లేదు. విచిత్రంగా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ యాదవ్ గెలిచారు. కొంతలో కొంత కాంగ్రెస్ పరువు నిలిపింది ఆయనే. సాధారణ  పరిస్థితుల్లో అయితే ఇక్కడ కూడా టీఆర్ఎస్ జెండా పాతేసేదే. అప్పటివరకూ కాస్త టీఆర్ఎస్ పై చేయిగా ఉన్న ఈ ప్రాంతంలో బాబు అడుగుపెట్టకుండా ఉంటే.. కాంగ్రెస్  కూ  పరాజయం తప్పేది కాదు.

కానీ చివరి నిమిషంలో బాబు అడుగు పెట్టిన తర్వాత కాస్త సీన్ మారిందని గులాబీ నేతలు మధనపడుతున్నారు. బాబు రాకతో సీమాంధ్రుల ఓట్లు టీడీపీకి పోలయ్యాయట. దాంతో ఓట్ల విభజన జరిగి చివరకు అది కాంగ్రెస్ కు లాభమైందట. సో.. మొత్తానికి చంద్రబాబు అలా కాంగ్రెస్ ను గెలిపించారన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: