ఓడిపోయిన బాధో లేక తెరాస చేతిలో కనీసం డిపాజిట్ లు కూడా దక్కలేదు అన్న ఆపేక్షో కానీ చిన్న బాబు నారా లోకేష్ అప్పుడే రంగంలోకి దిగిపోయారు. ఇంకా ప్రమాణ స్వీకారాలు జరగలేదు, మేయర్ ఎవరో తేలనే లేదు. అప్పుడే చినబాబు డిమాండ్ లు మొదలు పెట్టేసాడు. తెరాస  జంటనగరాల వాసులకి  ఇచ్చిన హామీలని తూచా తప్పకుండా పాటించాలి అని లోకేష్ డిమాండ్ చేస్తున్నారు.

 

 

 ప్రజల తరఫున పోరాటం కూడా చేస్తాం అంటున్నారు ఆయన. తెలుగుదేశం పార్టీ ని జనం పక్కకి గెంటేసి మరీ తెరాస కి ఓట్లు వేసి గ్రేటర్ పరిపాలన మీరే చెయ్యండి అంటూ రధం తోలే అధికారం వారి చేతిలో పెడితే ఇంకా మీరు ప్రజలతో కలిసి పోరాడేది ఏముంటుంది బాబు ? జనం నిజంగా మీరు పోరాట యోధులు అనీ ఏదైనా సాధించగలరు అనీ నమ్మి గనక ఉంటే మీకు మినిమం ఓట్లు అన్నా పడి ఉండేవి కదా ? అసలు చినబాబు గారు ఈ సోది మొత్తం ఆపి అధికారం తీసుకున్న తెలుగుదేశం ఏడాదిన్నర కాలంలో ఏపీ లో ఏం చేసారు అనేది చెప్పాల్సి ఉంది .

 

 

అక్కడ హామీలు, డిమాండ్ లూ సంగతి వారు చూసుకుంటే బాగుంటుంది అంటున్నారు టీడీపీ వ్యతిరేకులు. ఈ ట్విట్టర్ పిట్ట మాటలూ, డిమాండ్ లూ పక్కన పెట్టి ఏపీ లో అభివృద్ధి సరిగ్గా చేస్తే ఇక్కడ హైదరాబాద్ లో సెటిలర్స్ ఫామిలీ లు మీ మీదనమ్మకం ఏర్పరచుకుని మీకు ఒచ్చే ఎన్నికల్లో  ఓట్లు వేసే ఛాన్స్ ఉంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: