గులాబీ పార్టీ హైదరాబాద్ లో చరిత్ర తిరగరాసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది. 150 డివిజన్లకు ఏకంగా 99 డివిజన్లను కైశవం చేసుకుని మరోసారి సత్తా చాటింది.  గ్రేటర్ ప్రజలు కూడా ఈసారి  ఎన్నడూ లేని విధంగా గూలాబీ దళానికి పట్టం కట్టడంతో ప్రతిపక్షాలకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. బల్దియాలో 2009 ఎన్నికల్లో పోటీ చేయటానికి కూడా సాహసించని టిఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలపై తిరుగులేని ఆధిక్యత సాధించటం గమనార్హం. దశాబ్దాల తరబడి పాత బస్తీలో ఎంతో బలంగా ఉంటూ తన సీట్లను కాపా డుకుంటూ వస్తున్న ఎంఐఎం ఈ సారి కూడా పట్టు నిలబెట్టుకుంది. అయితే, చాలా చోట్ల టిఆర్ఎస్ జోరుకు బ్రేకులైతే వేయలేకపోయింది. ఇక జిహెచ్ఎంసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవటానికి కెసిఆర్ అనుసరంచిన అనేక వ్యూహాలు  బాగా పనిచేశాయన్న వాదన వినిపిస్తోంది. 


అయితే, కౌటింగ్ మొదలైనప్పటి నుండి ఓట్ల సరళిని చూస్తే వార్ వన్‌సైడ్ అన్నట్లు ఫలితాలు కనిపించాయి. బల్దియా మొత్తం మీదున్న 150 డివిజన్లకు గాను అధికార పార్టీ 99 డివిజన్లలో విజయదుందిభి మోగించటం విశేషం. సాధించిన విజయం కూడా ప్రత్యర్ధులపై సంపూర్ణ మెజారిటీ కావటం గమనార్హం.  ఇందుకు కెసిఆర్ కుమారుడు, ఐటి, పంచాయితీరాజ్ శాఖల మంత్రి కె. తారకరామారావుకు పూర్తి క్రెడిట్ దక్కుతుంది. కొంత కాలంగా పక్కరాష్ట్ర సీఎం చంద్రబాబుతో తెలంగాణ సీఎం కేసీఆర్... గొడవలకు దిగకుండా అభివృద్ధిలో పోటీ పడటాన్ని హైదరాబాద్ లోని సెటిలర్లు కూడా స్వాగతించినట్లు కనిపిస్తోంది. ఇక టీఆర్ఎస్ కు గ్రేటర్ లో ఇంత ఆదరణకు రాజధాని ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణమే అన్న ప్రచారం జరుగుతోంది. ఇక విపక్షాలకు చెందిన ప్రధానంగా టిడిపి, కాంగ్రెస్ పార్టీల్లోని బలమైన నేతలను తమ వైపుకు తిప్పుకునేట్లు గట్టి వ్యూహాన్నే రచించడం టీఆర్ఎస్ కు ప్లస్ అయింది.


కెసిఆర్ వ్యూహాన్ని కుమారుడు కెటిఆర్ ఆచరణలోకి తెచ్చారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి విపక్షాలకు చెందిన ఎంఎల్ఏలను పార్టీల్లోకి లాక్కోవటం ఒక ఎత్తెతే డివిజన్ల స్ధాయి లోని గట్టి నాయకులను గుర్తించి మరీ తమ వైపు లాక్కోవటం వల్లనే ఇంతటి భారీ విజయం దక్కింది. పలు డివిజన్లలో కాం గ్రెస్, టిడిపిలకు పోటీ చేసేందుకు సరైన అభ్యర్ధులు కూడా కనబడలేదంటేనే ఆ పార్టీల పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభ‌మైన రోజు నుంచి ప్ర‌జల్లో క‌నిపించిన స్పంద‌న‌లు గెలుపు ఎవ‌రిది అనేది స్ప‌ష్టం చేశాయి. ప్ర‌భుత్వ ప‌థ‌కాల ప‌ట్ల పాత‌నగ‌రం, కొత్త న‌గ‌రం అనే తేడా లేకుండా టీఆర్ఎస్ కు సానుకూలంగా క‌నిపించాయి. దీన్ని గ్ర‌హించిన విప‌క్షాలు హైద‌రాబాద్ ఓట‌ర్ల‌లో సెటిల‌ర్ల విష‌యాన‌మ‌ని తెరమీద‌కి తెచ్చి ల‌భ్ది పొందడానికి ప్ర‌య‌త్నించాయి. అలాగే ప్ర‌జ‌ల్లో అభ‌ద్ర‌త‌తా భావాల‌లు, ప్రాంతీయ అంశాల‌ను తెరమీద కి తెచ్చాయి. 


వీటిని ఓటు బ్యాంక్ గా మార్చుకునేందుకు ప‌డ‌రాని పాట్లు ప‌డ్డాయి. మ‌రోవైపు టీఆర్ఎస్ ప్ర‌భంజ‌నాన్ని చూసిన ఎంఐఎం పార్టీ ఎక్క‌డ త‌న పునాదులు క‌దులుతున్నాయ‌న్నంత క‌ల‌వ‌ర పాటు ప‌డ్డింది. అస‌హ‌నానికి గురైంది. టీఆర్ఎస్ విజ‌యాలు సెంటిమెంట్, భావోద్రేకాల‌పై ఆధారప‌డ్డ‌వి కాద‌ని మ‌రోసారి రుజువైంది. ఉద్య‌మ పార్టీగా ఇర‌వై  నెల‌ల కిందట అసెంబ్లీ ఎన్నిక‌ల గెలుపు నాటినుంచి.. ఆ త‌రువాత జ‌రిగిన ఉప ఎన్నిక‌ల విజ‌యాల‌ను సెంటిమెంట్ అనో, భావోద్రేకాలు అనో తేలిక చేసిన మాట‌ల‌కు జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు తిరుగులేని జవాబు చెప్పాయి. ప్ర‌భుత్వం చేప‌డుతున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలే అధికార పార్టీని గెలిపిస్తున్నాయ‌ని చాటి  చెబుతున్నారు. ఉద్య‌మ పార్టీగా... పోరాటాలు, త్యాగాల‌తో రాష్ట్రాన్ని సాధించిన టీఆర్ఎస్... ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చే దిశ‌లో అన్ని వ‌ర్గాలు న్యాయం చేసేలా అడుగులు వేసేందుకు టీఆర్ఎస్ ఇప్పుడు మంచి స‌మ‌యం. ఇక కేసీఆర్ విధానాలను నగరంలోని గల్లి గల్లీలో అట్టడుగు స్థాయి ప్రజల దగ్గరకు చేర్చడంలో కేటీఆర్ పడిన కఠోర శ్రమ ఎనలేనిది. 


నగరంలోని విద్యావంతులు, వివిధ భాషా సంస్కృతుల ప్రజల్లో విశ్వాసాన్ని నింప‌డంలో ఆయన పాత్ర అద్వితీయమైనది. కేటీఆర్ సాగించిన ప్రచారం అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని, ప్రేమను పొందగలిగింది. ఎన్నికల్లో సాధించిన అసాధారణ విజయం ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రతిఫలించింది. పాలనలోనూ సరికొత్త శకానికి నాంది పలకాలి. ఎన్నోఏళ్లుగా అనేక సమస్యలతో కునారిల్లుతున్న హైదరాబాద్ నగారాన్ని సమస్యల వలయం నుంచి విముక్తి చేయాలి. ట్రాఫిక్, డ్రైనే జీ, కాలుష్యం లాంటి దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు వేయాలి. మల్టీలెవల్ ైఫ్లె ఓవర్లను నిర్మించడం, నగర ప్రజల మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు రిజర్వాయర్లను నిర్మించడం లాంటి బృహత్తర పథకాల ను శరవేగంగా పూర్తి చేయాలి. అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల అంతరార్థం, ఆకాంక్ష ఇదే. 


అయితే ఇంత పెద్ద గెలుపునిచ్చిన గ్రేటర్ ప్ర‌జ‌ల‌కు టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తున్న‌ద‌న్న‌ది ఇప్పుడు ముందున్న స‌వాల్ . ఈ గెలుపు విష‌యం లో ముమ్మాటికి మంత్రి కేటీఆర్ తీసుకున్న శ్ర‌మ‌, శ్రద్ద  ఇంతా అంతా కాదు. అయన గ‌త రెండు నెల‌లుగా గ్రేటర్ హైద‌రాబాద్ ను క‌లియ తిరిగి గ్రేట‌ర్ ప్ర‌జ‌ల్లో ఓ కొత్త న‌మ్మ‌కాన్ని ఇచ్చారు. అంతేకాదు ఆయ‌న న‌గ‌రంలో ఉన్న స‌మ‌స్యల పై పూర్తి అవగాహ‌న వచ్చింది. ఇప్పుడు ఇంతే య‌ద్ద ప్రాతిప‌దిక‌న అభివృద్ధి పై దృష్టి పెట్టాలి. ఇప్ప‌టికే మున్సిఫ‌ల్ శాఖ ను కేటీఆర్ కే ఇవ్వ‌నున్న‌ట్లు గులాబీ బాస్ ప్ర‌కటించారు. మరి అభివృద్ది పై మంత్రి కేటీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోనున్నారో చూడాలి మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి: