మీడియా వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడం.. అవంటే గిట్టని వాళ్లు ఆ మీడియాపై విమర్సలు చేయడం మామూలే. గతంలోనూ చాలాసార్లు మీడియా కార్యాలయాల ముందు ధర్నాలు కూడా జరిగాయి. కానీ ఎప్పుడూ మీడియా ఆఫీసులపై మాత్రం దాడులు జరగలేదు.  రీసెంటుగా విజ‌య‌వాడ‌లోని ఓ న్యూస్ ఛానెల్ ఆఫీసుపై దాడి జ‌రగడం కలకలం రేపుతోంది. 

విజయవాడలోని నెంబర్ వన్ అనే న్యూస్ చానల్ ఆఫీస్ పై కొందరు రాళ్ల దాడి చేసినట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని దుండగులు తమ ఆఫీస్ పై శుక్రవారం రాత్రి రాళ్లతో దాడి చేశారని ఆ చానల్ ఎండీ పోలీసులకు ఫిర్యాదు చేశారట. ఈ ఘటనలో ఆఫీసు అద్దాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

ఐతే... ఈ దాడిపై అనేక వార్తలు వస్తున్నాయి. వాటిలో ఏది వాస్తవమో తేలాల్సి ఉంది. వాటిలో ఒక వాదన ప్రకారం దాడి చేసిన వాళ్లంతా పోలీసులే అని చెబుతున్నారు. ఈ ఛానల్ ఎంపీ మొన్నటి తుని కాపు ఐక్య గర్జన సభలో ప్రసంగించారట. ఈ పోలీసుల దాడికి ఈ ప్రసంగానికి ఏమైనా సంబంధం ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

నెంబర్ 1 చానెల్ నిర్వాహకుల తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఒక సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ ఛానల్ లో ఉద్యోగులకు జీతాలు కూడా సరిగ్గా చెల్లించడం లేదని చెబుతున్నారు. నిర్వాహకుల మధ్య కూడా బేధాభిప్రాయాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఓ మీడియా కార్యాలయంపై జరిగన దాడిని మాత్రం ఖండించాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: