రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌మిలు స‌ర్వ సాధారణం. ఒక కాయిన్ కు బొమ్మ బొరుసు ఎలానో రాజ‌కీయాల్లో గెలుపు ఓటమిలు అంతే. అయితే కేవ‌లం ఓట‌మిని చూసి పార్టీ ని విడిచిపోతే ఈ దేశంలో ఏ పార్టీ మ‌నుగ‌డ సాధించ‌దు. ఏ రాజ‌కీయ నాయ‌కుడు తాను అనుకున్న గమ్యాన్ని చేర‌లేడు.  కానీ తెలంగాణ రాష్ట్రంలో కేవలం అధికార పార్టీ వైపు మొగ్గు చూపే నాయ‌కులే ఎక్కువ‌గా ఉంటారు. అందులో ఒకరు గ్రేట‌ర్ కాంగ్రెస్ నాయకుడు  దానం నాగేంద‌ర్. ఆయ‌న రాజ‌కీయం పూర్తిగా భిన్న‌మ‌నే చెప్పాలి. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హాయాంలో క్యాబినేట్ లో చోటు ఇవ్వ‌లేద‌ని కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి టీడీపీ పార్టీ కి వెళ్లారు. అనంత‌రం చ‌ర్చ‌లు స‌ఫ‌లం కావ‌డంతో మ‌ళ్లీ టీడీపీ  కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వ‌చ్చారు. ఇలా ఆయ‌న చేసిన రాజీనామాల‌ క‌హాని  ఇంతా అంతా కాదు. తాజాగా మ‌రోసారి ఆయ‌న రాజీనామా చేశారు. 



వాస్త‌వానికి  ఎన్నిక‌లు జ‌రిగిన స‌మ‌యంలో దారుణ‌మైన ఓట‌మి ఎదురైతే...దానికి పూర్తి బాద్య‌త వ‌హిస్తూ తాము నిర్వ‌హిస్తున్న ప‌ద‌వికి రాజీనామా చేయ‌టం మామూలే.  దానికి పూర్తి బాద్య‌త వహించిన‌వారు రాజీనామా చేసినా విలువ ఉండేది కానీ ఆ పార్టీ గెలుపు ఓట‌మికి ఎలాంటి బాద్య‌త‌లు లేని దానం నాగేంద‌ర్ రాజీనామా చేయ‌డం ఇక్క‌డున్న ట్వీస్ట్.  గ్రేట‌ర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు గా ఉంటున్న దానం నాగేంద‌ర్ త‌న‌కు పూర్తి స్థాయి బాధ్య‌త‌లు అప్ప‌జెప్ప‌న‌ప్ప‌టికీ.. తాజా ప‌రాజ‌యానికి నైతిక బాధ్య‌త వహిస్తూ గ్రేట‌ర్ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీన‌మా  చేస్తున్న‌ట్లు దానం ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఇచ్చిన అవ‌కాశానికి ధ‌న్య‌వాదాలు చెప్పిన ఆయ‌న తాను కాంగ్రెస్ లోనే కొన‌సాగుతాన‌ని.. సామాన్య కార్య‌క‌ర్తగా వ్య‌వ‌హారిస్తాన‌ని పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో బీసీల‌కు, ఇత‌ర వెనుక బడిన వ‌ర్గాల‌కు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జ‌రుగుతుంద‌నీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఠా త‌గాదాలే త‌న‌నూ ఈ ప‌ద‌వికి రాజీనామా చేసేలా ప్రేరేపించాయ‌నీ చెప్ప‌డం కూడా విశేషం.


అంతేకాకుండా గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల‌కు సంబంధించినంత వ‌ర‌కు త‌న‌కు పూర్తిగా అధీకారాల‌ను, భాద్య‌త‌ల‌ను ఇవ్వ‌కుండా క‌ట్ట‌డి చేశారంటూ కూడా దానం నాగేంద‌ర్ ఒక‌ర‌కంగా అసంతృప్తి ని వ్య‌క్తం చేయ‌డం కూడా గ‌మ‌నించ‌దగ్గ విష‌య‌మే. ఈ ప‌రిణామాలు అన్నింటిని  ప‌రిశీలిస్తే ఎవ్వ‌రికైనా స‌రే దానం నాగేంద‌ర్ తొంద‌రలోనే తెలంగాణ  రాష్ట్ర స‌మితి లో చేరుతున్నార‌నే అనుమానం క‌ల‌గ‌క మాన‌దు. కానీ ఇది నిజం ఆయ‌న టీఆర్ఎస్ తో డీల్ పైన‌లైజ్ చేసుకున్న త‌రువాతే అక్క‌డ గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్టుగా పుకార్లు వ‌స్తున్నాయి. అయితే కొన్ని  వారాల కింద‌ట కూడా దానం టీఆర్ఎస్ చేరిపోతున్న‌ట్లుగా  కూడా చాలా పుకార్లు వ‌చ్చాయి. అంతా మ‌రో గంట లో చేరిపోతున్నారు అంటూ వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే కాంగ్రెస్ అదిష్టానం బుజ్జ‌గింపో లేక కావాల‌నే గ్యాబ్ ఇవ్వాల‌నుకున్నారో కానీ వెంట‌నే త‌న  చేరిక‌కు పుల్ స్టాప్ పెట్టారు దానం. ఇప్పుడు మాత్రం దానం చేర‌డం ఖ‌చ్చితంగా ఖ‌రారైంద‌నీ అంద‌రూ అనుకుంటున్నారు.


అయితే దానం గ‌తంలో  టీఆర్ఎస్ లో చేర‌డానికి ఇప్పుడు చేర‌డానికి మ‌ధ్య ఓ భారీ వ్య‌త్యాసం క‌నిపిస్తోంది. గ‌తంలో పార్టీ లో చేరితే టీఆర్ఎస్ వైపు నుంచి ఆయ‌న‌కు కొన్ని తాయిలాలు పార్టీ నుంచి సిద్దంగా ఉన్నాయి. ఆయ‌న కోసం ఒక నామినేటెడ్ ప‌ద‌వి ఇవ్వ‌డానికి... ఆయ‌న అనుచరులు కొంద‌రు గ్రేట‌ర్ లో కార్పోరేట‌ర్ టికెట్లు ఇవ్వ‌డానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ద ప‌డింది. కానీ ఇప్పుడు అవేమీ లేవు అని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. లేక‌పోయినా స‌రే గ్రేట‌ర్ ప‌రిధిలో టీఆర్ఎస్ సాధించిన విజ‌యాన్ని గ‌మ‌నించిన  త‌రువాత భేష‌ర‌తుగా తాను త‌మ త‌ర‌పునా ఎలాంటి డిమాండ్లు వినిపించ‌కుండా టీఆర్ఎస్ లో చేర‌డానికి దానం నాగేంద‌ర్ అంగీక‌రించిన‌ట్టు తెలుస్తోంది. దానం నాగేంద‌ర్ టీఆర్ఎస్ లోకి వ‌చ్చేలాగా ఆయ‌న రాజ‌కీయ గురువు డి.శ్రీనివాస్ చ‌క్రం తిప్పార‌నీ గ‌తంలో కూడా ఆయ‌నే మ‌ధ్య వ‌ర్తిత్వం న‌డిపిన‌ప్ప‌టికీ చివ‌రి క్ష‌ణాల్లో ఆగిపోయిన దానం చేరిక మాత్రం  ఈ సారి పైన‌లైజ్ అయింద‌నీ పార్టీ వ‌ర్గాలు చెపుతున్నాయి.


అయితే దానం నాగేంద‌ర్ టీఆర్ఎస్ లోకి చేర‌డం వ‌ల్ల కాంగ్రెస్ పార్టీకి కొత్త‌గా వ‌చ్చే న‌ష్టం అంటూ ఏమీ ఉండక‌పోవ‌చ్చు. కానీ టీఆర్ఎస్ కు ఎంతో కొంత దానం రూపేణా లాభం చేకూరుతుంద‌నీ భావించాల్సి ఉంటుంది. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆ పార్టీ మీద అసంతృప్తి లేదా భ‌విష్య‌త్తు మీద ఆశ ఉన్న మరికొంద‌రు న‌గ‌ర నాయ‌కులు టీఆర్ఎస్ లోకి జంప్ చేస్తార‌నే అనుమానాలు కూడా ముమ్మ‌రంగా సాగుతున్నాయి. బ‌డుగు... బ‌ల‌హీన వ‌ర్గాల్ని పార్టీ దూరం చేసుకుంద‌ని.. ఆ విష‌యాన్ని పార్టీ అధినాయ‌క‌త్వానికి ప‌లుమార్లు చెప్పిన‌ట్లుగా వెల్ల‌డించిన దానం.. పార్టీలో గ్రూపుల్ని ప్రోత్స‌హిస్తున్నార‌ని... పార్టీకి మంచిది కాద‌ని తాను ఇంత‌కు ముందే చెప్పిన‌ట్లుగా పేర్కొన్నారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ వారంతా ఓడిపోతున్న‌ట్లు తాను ముందే చెప్పిన‌ట్లుగా దానం పేర్కొన‌టం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల మూడ్ చూస్తేనే విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మైంద‌ని చెప్పారు. హైద‌రాబాద్ ప్ర‌జ‌లు చాలా తెలివిగా ఓట్లు వేసిన‌ట్టుగా వ్యాఖ్యానించారు. 


దానం నాగేందర్ రెడ్డి


టీఆర్ఎస్ త‌ప్ప వేరే పార్టీ అధికారంలోకి వ‌స్తే అభివృద్ధి జ‌ర‌గ‌ద‌న్న ఆలోచ‌న‌తోనే గ్రేట‌ర్ వాసులు ఓట్లు వేసిన‌ట్టుగా పేర్కొన్నారు. అయినా కొస‌రు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న దానం  రాజీనామా చేయ‌డంలో ఆంత‌ర్య‌మేంటి?  అయినా ఓడిపోతున్న‌ట్లు గా ముందే తెలిసిన‌ప్పుడు రిజ‌ల్ట్ రాగానే నైతిక బాధ్య‌త అంటూ రాజీనామా  చేయ‌డ‌మంటేనే అర్ధం చేసుకోవ‌చ్చు. దానం నాటి నుంచి  ఓ పాల‌సీ ప‌ద్ద‌తి ని అవ‌లంభిస్తున్న‌ట్లు క‌నిపిస్తున్న‌ట్లు రాజ‌కీయ వర్గాలు గుస గుస లాడుత‌న్నారు. అయ‌న  అధికారంలో ఉన్న పార్టీ పై ఎక్కువ మొగ్గు చూపిస్తార‌న్న‌ది గ‌తంలోనే రుజువ‌య్యింది. ఇప్పుడు కొత్త‌గా ఆలోచించేది ఏమిటంటే ఆయ‌న ఎప్పుడు తెరాసా లో చేరుతున్నార‌న్న విష‌యం గురించే.  అయ‌న మ‌హుర్తం ఎప్పుడు ఖ‌రారు చేసుకున్నారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: