తమిళనాడులో అందరూ చూస్తుండగానే ఘోరం జరిగిపోయింది. అయితే అది ఎవరో చేసింది కాదు..ప్రకృతి వైపరిత్యం. తమిళనాడులోని వేల్లూరులోని ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆకాశంలోంచి భారీ గ్రహ శకలం పడింది. వేలూరు జిల్లా నాట్రాంపల్లిలోని…భారతీదాసన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో విషాదం చేసుకుంది. అయితే భారీ శబ్ధంతో ఓ వింత వస్తువు భూమిపై పడటం అందులోనూ ఇంజనీరింగ్ కళాశాల బస్సు డ్రైవర్‌ మృతి చెందడం ఒక్కసారిగా జరిగిపోయింది.

అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఆకాశం నుంచి పడింది గ్రహశకలమే అయిన ఆ ఇంజనీరింగ్ కళాశాల బస్సుపై పడటంతో ఇంత అనర్ధం జరిగిందని అంటున్నారు అంతే కాదు దీంతో బస్సు ధ్వంసమైంది. బస్సులో ఉన్న డ్రైవర్ మృత్యువాతపడ్డారు. దీంతో ఇంజనీరింగ్ కళాశాలపై ఆకాశం నుంచి బాంబు వేశారంటూ పుకార్లు షికారు చేశాయి.

అనంతరం పేలుడు సంభవించిందని వార్తలు షికారు చేశాయి. అనంతరం ఆకాశం నుంచి కిందపడింది గ్రహశకలం అని, అది బస్సుపై పడడం వల్ల భారీ శబ్ధం వచ్చిందని అధికారులు నిర్ధారించారు. దీంతో అంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: