ప్రపంచంలో ఉగ్రవాదుల దాడులు జరిగాయంలే దాని మూలాలు ఖచ్చితంగా పాకిస్థాన్ లో ఉంటాయని ప్రపంచ దేశాల ఉద్దేశ్యం..అయితే ఇప్పుడు అక్కడే విపరీతంగా ఉగ్రదాడులు జరుగుతుండటం గమనార్హం. ఆ మద్య ఓ యూనివర్సిటీలో కాల్పులు జరిపారు..ఘటన మరువకముందే మరో చోట కాల్పులు మారణహోమం సృష్టించారు. తాజాగా పాకిస్తాన్ లో ఉగ్రమూకలు మరో సారి రెచ్చిపోయారు. బెలుచిస్తాన్ ప్రాంతంలో ఆత్మాహుతి దళం దాడులు జరిపి 8 మంది అమాయకపు జనాల ప్రాణాలు తీశారు.

ఈ దాడిలో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. బైక్ పై వచ్చిన మానవ బాంబర్లు తమ గమ్యస్థలానికి చేరుకోగానే తమను తాము పేల్చుకున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.  అయితే ఈ దాడి భద్రతా దళాలే లక్ష్యంగా చేసినప్పటికీ ఈ దాడిలో ఇద్దరు సైనికులు మృతి చెందగా మిగతా వారంతా అమాయ ప్రజలే.  ఇదిలా ఉండగా క్షతగాత్రులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని పాక్ కు చెందిన పోలీసు అధికారి ఇంతియాజ్ వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: