తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్ అలుపెరుగని పోరాటం చేసిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారు తెలంగాణ ప్రజలు. 60 ఏళ్ల కల నెరవేరిన సమయంలో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై గట్టి నమ్మకం ఏర్పడింది. అందుకే మొన్న జరిగిన వరంగల్ ఉప ఎన్నికల్లో కూడా అఖండ విజయాన్ని అందించారు. తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. గ్రేటర్ లో అత్యధిక సీట్లు గెల్చుకొని చరిత్రం సృష్టించింది.

అయితే టీఆర్ఎస్ తరుపు నుంచి ప్రచార బాధ్యతలు తీసుకున్న కేటీఆర్ ప్రజల్లో ఆ పార్టీపై గట్టి నమ్మకం ఏర్పడేలా చేశారు. నిరుపేద దగ్గర నుంచి ఐటీ దిగ్గజాల వరకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు చేయబోయే కార్యక్రమాలు గురించి చక్కటి అవగాహన కలిగేలా చేసినందు వల్లే ఇంతటి అద్భుతమైన విజయం అందుకున్నారు. ఇది ఇప్పడు తెలంగణలో ప్రతి ఒక్కరి మాట..అంతే కాదు టీఆర్ఎస్ లో ప్రతి నాయకుడు, కార్యకర్తల అంటున్న మాట.  తెలంగాణ ముఖ్య మంత్రి కే . చంద్రశేఖర్ రావు గారు  కూతురు ఎంపి కవితగారు  సంచలన వ్యాఖ్యలు చేసారు . కేటిఆర్ ను ఉద్దేశించి ఆమె మాటలాడుతు  సిఎం కెసిఆర్  గారి రాజకీయ వారసుడు మంత్రి కేటిఅర్ అని ఆమె చెప్పారు.

గ్రేటర్ లో  కేటిఅర్ గారికి అప్పగించిన  కెసిఆర్ గారు అప్పగించిన బాద్యతలను సమర్ధ వంతంగా నెరవేర్చారు  అని  ఎంపి కవిత గారు ప్రశంసించారు. ఈ  నేపథ్యంలో కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ అని కవిత వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.టీఆర్ఎస్ 99 సీట్లతో విజయకేతనం ఎగురవేసింది. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచార బాధ్యతలను చేపట్టిన కేటీఆర్ పార్టీ ఘనవిజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

సీఎం కేసీఆర్ ఆయన తనయుడు కేటీఆర్


కెసిఆర్ మేనల్లుడు హరీష్ రావు, కెటిఆర్ ల మద్య సాగుతున్న పోటాపోటీ వాతావరణం నేపధ్యంలో కవిత ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారని అనుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయంలో చాలా మార్పు వచ్చిందని , నగరంలో అన్ని వర్గాల వారు టీఆర్ఎస్కు ఓటేశారని ఆమె చెప్పారు. అందువల్లనే ఇంత మెజార్టీ వచ్చిందని కవిత అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: