కాపులకు రిజర్వేషన్‌ కల్పించాలంటూ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో నిరశన దీక్ష చేపట్టిన ముద్రగడ పద్మనాభాన్ని విరమణకు ఒప్పించే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.ఆదివారం అర్థరాత్రి  ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు ముద్రగడతో చర్చలు జరిపారువారి ముందు ముద్రగడ కొన్ని ప్రతిపాదనలు ఉంచారు.


ఐతే.. ముద్రగడ ప్రతిపాదనలను వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని తోట త్రిమూర్తులుబొడ్డు భాస్కర రామారావు తెలిపారుమొదటి నుంచి ముద్రగడ దీక్షను కాపు నాయకుల సాయంతో ఎదుర్కొంటూ వస్తున్న చంద్రబాబు ఆయన దగ్గరకు ఎమ్మెల్యేలుఎమ్మెల్సీలను మాత్రమే పంపుతున్నారు.


ముద్రగడతో చర్చలకు మంత్రులు వెళ్తామని కోరినా.. చంద్రబాబు ఒప్పుకోలేదని మీడియాలో కథనాలు వచ్చాయిమంత్రులు వెళ్తే ముద్రగడ స్థాయి పెరుగుతుందని .. ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు మాత్రమే వెళ్లాలని బాబు డిసైడయ్యారుకానీ ముద్రగడ సీఎం ను మించిన జగమొండిగా కనిపిస్తుండటంతో చంద్రబాబు దిగిరాక తప్పదేమో అనిపిస్తోంది.


ఆదివారం అర్థరాత్రి చర్చలకు వచ్చిన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు మాటలు వింటే.. సోమవారం ముద్రగడతో చర్చలకు మంత్రులు వస్తారన్నట్టుగా సంకేతాలు ఇచ్చారుమందుగా మంత్రులు వస్తారని చెప్పిన ఆ కాపు నేతలు.. ఆ తర్వాత నాలిక్కరుచుకున్నారుప్రభుత్వ ప్రతినిధులు వస్తారు.. వారు ఎవరైనా కావచ్చని సన్నాయి నొక్కులు నొక్కారుఅంటే క్రమంగా చంద్రబాబు తలవంచుతున్నట్టేనా... !?


మరింత సమాచారం తెలుసుకోండి: