కాపులకు రిజర్వేషన్ అంశం ఏపీ చంద్రబాబును ముప్పుతిప్పలు పెడుతోందికరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందాన ఈ రిజర్వేషన్ల వ్యవహారం సాగుతోందిగత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇప్పుడు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందిఈ సమయంలో తమకు మిత్రుడుగా భావించే జనసేన అధ్యక్షడు పవన్ కల్యాణ్ సైతం తమపై ఒత్తిడి తేవడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు.


మొన్నటికి మొన్న తుని కాపు ఐక్య గర్జన విధ్వంసం తర్వాత మీడియా ముందుకు వచ్చిన పవన్.. ఎవరికీ అర్థంకాని రీతిలో స్పందించి మళ్లీ వెళ్లిపోయారుదీనిపై సోషల్ మీడియాలోనూమీడియాలోనూ విమర్శలు రావడంతో పవన్ కాస్త మేలుకున్నట్టున్నారుకాపు రిజర్వేషన్ల అంశంపై పవన్ మరోసారి ట్విట్టర్ లో స్పందించారుప్రభుత్వం కాపుసంఘం నేతలతో నేరుగా చర్చించి సమస్య పరిష్కరించాలన్నారు.


పవన్ కల్యాణ్ తన ట్వీట్ లో కోరారు:


కాపు రిజర్వేషన్ల అంశంలోఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని పవన్ కల్యాణ్ తన ట్వీట్ లో కోరారుసమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు మేధావులతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలని పవన్ సూచించారుపవన్ కూడా కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టే సరికి టీడీపీ నాయకులకు గుండెల్లో గుబులు మొదలైంది.


ఇక ఎదురుదాడికి మరింత పదను పెట్టాలని భావించిన టీడీపీ నాయకులు పాత చిట్టాలన్నీ ముందేసుకున్నారుకాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వేసిన బిసీ కమిషన్ కాపుబలిజతెలగఒంటరి కులాలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై సర్వే చేసేందుకు 2008లో 45లక్షలు అడిగితే 2011లో కేవలం 10లక్షలు మాత్రమే విడుదల చేసిందన్న విషయాన్ని కనిపెట్టారు.


మంత్రి నారాయణ ఆ పాత జీవోను వెలికి తీసి.. మీడియా ముందు ప్రదర్శించారులక్షా 40వేల కోట్ల బడ్జెట్ ఉన్న సమయంలో కేవలం 10లక్షలు విడుదల చేసిన ప్రభుత్వంలో మంత్రి పదవులు వెలగబెట్టిన వారు ఇపుడు ముద్రగడకు మద్దతివ్వటం... ఆయన తీసుకోవటం సిగ్గుచేటని కౌంటర్లు మొదలు పెట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: