కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్ తో మాజీ రాష్ట్రమంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న నిరాహారా దీక్ష నాలుగోరోజుకు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం మంత్రులు ముద్రగడతో దీక్ష విరమింప చేయాలని రంగంలోకి దిగారు. ఆయనతో టిడిపి ఎపి అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం ఉదయం గంటన్నరకు పైగా చర్చలు జరిపారు. వారి ముందు ముద్రగడ మూడు ప్రతిపాదనలు ఉంచారు. ప్రభుత్వం తన ప్రతిపాదనలకు అంగీకరించడంతో ముద్రగడ దీక్షను విరమించారు.

 ముద్రగడను ఆనందంతో కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు ఆలింగనం చేసుకున్నారు.ప్రభుత్వం తరఫున ముద్రగడతో చర్చలు జరిపినవారిలో కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడులతో పాటు బొడ్డు భాస్కర రామారావు, శాసనసభ్యులు తోట త్రిమూర్తులు, వర్మ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గత నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఇరు వర్గాలకు అంగీకర యోగ్యమైన ప్రతిపాదనలు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.  
 
ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ..   కాపులను బీసీల్లో కలుపుతామని సీఎం ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కాపుల ఆకలి తీర్చాలనే రోడ్డెక్కాను. ముఖ్యమంత్రి ని నిందించాలనే ఉద్దేశం  నాకు లేదు  అనుచిత వ్యాఖ్యలు చేసి ఉంటే క్షమించాలి. రిజర్వేషన్లు ఆలస్యం అవడంతోనే దీక్షకు దిగాను.  బీసీలకు అన్యాయం చేయాలని కోరుకోవడం లేదు  మా జాతికి న్యాయం చేయాలన్నదే నా దీక్ష ఉద్దేశం  డిమాండ్లలో చిన్న చిన్న అభ్యంతరాలున్నా జాతికోసం అమోదించా.

దీక్షకు ముందు మీడియాతో మాట్లాడుతున్న ముద్రగడ


20 ఏళ్లుగా మా డిమాండ్లను పక్కన పడేశారు. రిజర్వేషన్లు ఆలస్యం కావడంతోనే దీక్షకు దిగాను. ఇచ్చిన హామీని త్వరితగతిన అమలు చేయాలి.  అనరాని మాటలు అంటే క్షమించాలి. దీక్షకు నాతో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తే సీఎం కాళ్లు కడుగుతా మరోసారి కాపు సోదరులకు విజ్ఞప్తి రాష్ట్రవ్యాప్తంగా అందరినీ దీక్ష విరమించాలని కోరుతున్నా. 


మరింత సమాచారం తెలుసుకోండి: