ఆ మద్య ముంబైలో జరిగిన దాడి కేసులో ముద్దాయిగా ఉన్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ అప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే. అయితే పాకిస్తానీ-అమెరికన్, లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ సోమవారం ముంబై కోర్టుకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సాక్ష్యం ఇవ్వనున్నాడు. ముంబై దాడుల తర్వాత 2009లో ఒకసారి భారత్‌కు వచ్చానని లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ పేర్కొన్నారు దాడుల కుట్రపై మరిన్ని వివరాలు బయటికొచ్చే అవకాశముంది.

భారత న్యాయ చరిత్రలో భారతీయ కోర్టు ముందు ఒక ‘విదేశీ ఉగ్రవాది’ సాక్ష్యం ఇవ్వనుండడం ఇదే తొలిసారి అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ తెలిపారు. 26/11 ముంబై పేలుళ్ల సూత్రధారి డేవిడ్ హెడ్లీని ముంబై కోర్టులో పోలీసులు హాజరు పరచనున్నారు. కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డేవిడ్‌ను న్యాయస్థానం విచారిస్తుంది. భారత్‌లో మొత్తం 8 సార్లు పర్యటించాను. పాకిస్థాన్ నుంచి 7 సార్లు, యూఏఈ నుంచి ఒకసారి భారత్‌కు వచ్చాను అని తెలిపారు.

లష్కరే తోయిబాకు చెందిన సాజిద్ మీర్ భారత్‌కు వచ్చేందుకు సాయం చేశాడు. భారత్‌కు వచ్చేందుకే పేరును దావూద్ గిలానీకి బదులు డేవిడ్ హెడ్లీగా మార్చుకున్నానని చెప్పారు. అంతే కాదు ముంబై దాడుల వెనుక ఐఎస్‌ఐ, లష్కరే తోయిబా హస్తం ఉందని తేల్చిచెప్పారు. కాగా హస్తినలోని భారత ఉప రాష్ట్రపతి నివాసం, ఇండియా గేట్, సీబీఐ కార్యాలయాలపైనా కూడా రెక్కీ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ రెక్కీ కోసం తనకు ఐఎస్‌ఐ డబ్బు ముట్టజెప్పిందని పేర్కొన్నాడు. ముంబై దాడుల కేసులో 35 ఏళ్ల జైలు శిక్షను డేవిడ్‌కు కోర్టు విధించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: