ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఫేస్ బుక్ హవా నడుస్తుంది. కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరికీ ఫేస్ బుక్ ఖాతా ఉంటుంది..తమకు బ్యాంకుల్లో ఖాతా ఉన్నాలేకపోయినా ఫేస్ బుక్ లో మాత్రం ఖచ్చితంగా ఖాతా ఓపెన్ చేస్తున్నారు. ఇక ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్స్‌బర్గ్ ఆ మద్య కూతురు పుట్టిన విషయం తెలిసిందే..తన కుమార్తెకు చైనీస్ పేరు పెట్టుకుంటానని గతంలో ప్రకటించారు.చైనా నూతన సంవత్సర సంబరాల్లో భాగంగా తన కుమార్తెకు 'చెన్ మింగ్ యూ' అనే పేరును పెట్టాడు.

ఈ మేరకు జూకర్స్ బర్గ్ దంపతులు తన అధికారిక ఫేస్‌బుక్‌లో అభిమానులతో పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు.కాగా 2012లో పెళ్లి చేసుకున్న జూకర్స్ బర్గ్, ప్రిస్కిల్లా దంపతులకు గతేడాది నవంబర్‌లో మాక్స్ పుట్టింది. గత ఏడాది చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అమెరికా పర్యటన సందర్భంగా జూకర్స్ బర్గ్ కుమార్తెకు చైనీస్ పేరు పెట్టుకోవాలనే జిన్‌ పింగ్ కోరిగా జూకర్స్ బర్గ్ సున్నితంగా తిరస్కరించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

మొత్తానికి తన ముద్దుల కూతురుకి చైనీస్ పేరు పెట్టుకుంటానని గతంలోనే ప్రకటించిన జుకర్  తన కోరికను నెరవేర్చుకున్నాడు. దీంతో పాటు ఓ క్యూట్  వీడియోనొక్కదాన్ని   షేర్  చేశారు. చైనాలోని మాండరిన్లో నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్న ఈ దంపతులు తమ చిన్నారి పేరును అధికారికంగా ప్రకటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: