తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ టీడీపీలో కొనసాగుతూ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి గత సంవత్సరం నుంచి అస్సలు కలిసి రావడం లేదు. ఆ మద్య ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా బుక్కయ్యాడు..ఇది వైరల్ లా సోషల్ నెట్ వర్క్ లో వ్యాపించింది. తర్వాత చర్లపల్లి జైలుకు వెళ్లి బెయిల్ పై రావడం జరిగింది. తర్వాత వరంగల్ ఉప ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచాచం చేసినా అక్కడ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇక గ్రేటర్ లో అయినా సత్తా చాటుదాం అనుకున్న సమయంలో ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకొని ఘోరంగా పరాజయం పొందారు.  దీంతో ఒక వైపు టీడీపీ అధినేత చంద్రబాబు, రేవంత్ పై గుర్రుమీదే ఉన్నారు.

తెలంగాణలో వచ్చిన ప్రతిఎన్నికల్లో పార్టీ ఘెరంగా ఓడిపోవడం, నేతలంతా పార్టీ వీడటంపై సీనియర్లకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఆదివారం టీటీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పార్టీ పరిస్థితిపై వాకబు చేసినట్లు తెలిసింది.  ఇకపోతే ఎన్నికల ప్రచారంలో ఏమాత్రం హుందాతనం ప్రదర్శించని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తీరుతోనే పార్టీకి వరుస వైఫల్యాలు ఎదురవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రేటర్ ఫలితాల తర్వాత  నారాయణఖేడ్ నియోజకవర్గంలో రెండ్రోజులుగా రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను అదే పనిగా విమర్శిస్తుండటంతో ప్రజలు ఒక్కసారిగా గోల చేశారు..మీరు అప్పుడేం చేశారని నిలదీశారు. అక్కడ ఉన్న ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది.దీంతో అసహనానికి గురైన రేవంత్ ప్రజలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి దీటుగా ప్రజలు కూడా ఆయన ప్రచారాన్ని బహిష్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏది ఏమైనా రేవంత్ పరిస్థితి ముందు చూస్తే నుయ్యి..వెనుక చూస్తే గొయ్యిలా ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: