తెరాస పార్టీ లో మరీ ముఖ్యంగా కెసిఆర్ ఫ్యామిలీ లో విభేదాలు ఒచ్చాయి అని అనుకునే వారికి గ్రేటర్ ఎన్నికలలో కానీ గెలిచిన తరవాత జరిగిన ఆనందంలో కానీ ఎక్కడా హరీశ్ రావు కనపడక పోవడం పెద్ద విశేషం. కెసిఆర్ వారసుడు మంత్రి కేటీఆర్ అంటూ కెసిఆర్ కుమార్తె కవిత మొన్ననే ప్రకటించారు కూడా. దానికి తోడు కేటీఆర్ కి కొత్త శాఖని కూడా అప్పజెప్పారు కెసిఆర్.

 

 

 

 ఈ దెబ్బతో హరీశ్ రావు - కేటీఆర్ ల మధ్యన ఎవరు నిజమైన వారసుడు అనే విషయంలో మంచి క్లారిటీ వచ్చింది. ఈ పరిణామాలు అన్నీ హరీష్ కి పొగబెట్టబోతున్నాయి అని కూడా ఒకవర్గం నుంచి వాదన వినిపిస్తోంది. నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక విషయంలో బిజీ గా ఉన్న హరీష్ మీడియా తో ఒక సందర్భంలో మాట్లాడుతూ నారాయణఖేడ్ లో కూడా అద్వితీయమైన మెజారిటీ తో గెలుస్తాం అని ప్రకటించారు ఆయన.

 

 

 

 

అభివృద్ధి అనేది కెసిఆర్ వలనా తెరాస వలనా మాత్రమే సాధ్యం అని చెప్పిన ఆయన కుటుంబ రాజకీయాల విషయం లో వింతగా స్పందించారు, కెసిఆర్ తరవాత కేటీఆర్ అంటున్నారు మీ పరిస్థితి ఏంటి అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్న కి. " మా పార్టీ లో ఉన్నది సి ఏం కెసిఆర్ - no 1 ఆయనే మాకు నెంబర్ వన్ .. ఇక టూ త్రీ అంటూ ఎవరం లేము" అని చెప్పుకొచ్చారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా మంత్రి కేటీఆర్ పనితీరు బాగుందని.. పార్టీకి కేటీఆర్ చాలా కృషి చేస్తున్నారని కితాబిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: