తెలంగాణలో టీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగుతుంది. తెలంగాణ సాధన కోసం పోరాడిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మరింత పటిష్టం అయ్యింది. తెలంగాణలో అధికార పక్షంగా విజయ పరంపర కొనసాగిస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో విజయఢంకా మోగించిన టీఆర్ఎస్ మొన్నామద్య వరంగల్ లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా రికార్డు స్థాయిలో విజయం సాధించింది. ఇక తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన గ్రేటర్ ఎలక్షన్ లో కూడా ప్రతిపక్షాలకు సింగిల్ డిజిట్ మాత్రమే వచ్చాయి.

ప్రజలు మరోసారి టీఆర్ఎస్ పార్టీకి చారిత్రక విజయాన్ని అందించారు తెలంగాణ ప్రజలు. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ప్రతిపక్షాల నుంచి సీనియర్ నాయకులు వలస రావడం మొదలైంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితిలో విపక్ష ఎమ్మెల్యేలు చేరుతారని వచ్చిన వార్తలు మరోసారి రుజువైంది. కుత్బుల్లాపూర్ తెలుగుదేశం  ఎమ్మెల్యే వివేక్ సీఎం చంద్రశేఖర్ రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. అయితే గత రెండు రోజుల క్రితమే హరీష్ రావు తో సంప్రదింపులు జరిపిన వివేక్ సీఎం చంద్రశేఖర్ రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు.

ఆయన రాజీనామా లేఖ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పంపించారు.ముందుగా కొంతసేపు కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. సీఎంతో భేటీ అనంతరం పార్టీలో చేరారు. ఆయనతో పాటు మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రాబోయే ఒకటి రెండు రోజుల్లో టీఆర్ఎస్‌లో చేరుతారని విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: