నగరంలో నిన్న జరిగిన డాక్టర్స్ కాల్పుల ఘటనలో శశికుమార్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో నిన్న హిమాయత్‌నగర్‌లో వైద్యుల మధ్య జరిగిన కాల్పుల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. నిన్న హిమాయత్‌నగర్‌లో వైద్యుడు ఉదయ్‌కుమార్‌పై కాల్పులు జరిపిన శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా మెయినాబాద్‌లో నక్కల పల్లిలోని ఫామ్ హౌస్‌లో వైద్యుడు శశికుమార్ మృతదేహాన్ని గుర్తించారు.

ఆ సూసైడ్ నోట్ లో ఉదయ్ పై కాల్పులు జరిపింది తాను కాదని, పక్కనే ఉన్న మరో డాక్టర్ సాయి కుమార్ అని రాశాడు. కాల్పులు జరపగానే భయంతో పారిపోయానని రాశాడు. ఉదయ్, సాయి తనను మోసం చేశారని పేర్కొన్నాడు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు శశికుమార్ తన భార్యతో సారీ అంటూ మూడుసార్లు చెప్పి కాల్పులు చేసుకున్నట్లు చెపుతున్నారు.ఆత్మహత్య చేసుకో వడానికి శశికుమార్ వాడిన రివాల్వర్‌తో పాటు నాలుగు రౌండ్ల బుల్లెట్లను కూడా పోలీసులు నక్కలపల్లిలోని ఫామ్‌హౌస్‌లో స్వాధీనం చేసుకున్నారు.  

చికిత్స పొందుతున్న ఉదయ్

Hyderabad: Doctor shoots colleague in row over IT zone hospital

తన భార్యకు ఫోన్ చేసే ముందు చంద్రకళ అనే తన ఫ్యామిలీ ఫ్రెండుతో అతడు సుమారు 15 నిమిషాల పాటు మాట్లాడాడు. ఇంతకీ ఆ చంద్ర కళ ఎవరూ అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతే కాదు ఆ పదిహేను నిమిషాలు ఆమెతో ఏమేమి మాట్లాడు అన్న విషయాన్ని కూడా రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మరో వైపు శశికుమార్ భార్య కాంతి సంచలన వ్యాఖ్యలతో కేసు ఎలాంటి మలుపులు తిరగబోతుందో అని ఉత్కంఠ నెలకొంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: