ఏపీలో ఈ మద్య కాపులను బీసీలో చేర్చాలని ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష చేయడం ఆయన షరతులకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో దీక్ష విరమించారు. అయితే ఈ అంశంపై ఇప్పుడు బీసీ వర్గాల్లో నిరసనలు మొదలయ్యాయి. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ వర్గాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నుముట్టాయి. ఓ సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతూ..తాను ఎప్పుడూ పేదలను విస్మరించలేదని పేదరిక నిర్మూలనకు కట్టుబడే ఉంటానని అన్నారు.

అదే విధంగా  కులాలు మతాలనే అడ్డుగోడలు మనం పెట్టుకున్నవేనని ఏ ఒక్కరూ తాను పలానా కులంలో పుట్టాలని కోరుకుంటూ జన్మించలేరు కదా అని ఉదహరించారు. ఈ సందర్భంలోనే ఎవరూ ఎస్సీగా జన్మించాలని కోరుకోరు కదా అని చంద్రబాబు అన్నారు. అయితే, తాను ఎస్సీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కొందరు కావాలనే తప్పుబడుతూ రాజకీయాలు చేస్తున్నారని అయన విమర్శించారు. ఇక్కడే ఆయన మాటలను తప్పు పడుతున్నారు..ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఓ కులం గురించి మాట్లాడుతూ పబ్లిగ్గా ఆ కులంలో పుట్టాలని ఎవరూ అనుకోరు అన్న మాటలకు అర్ధం ఏమిటీ..? అంటే చంద్రబాబుకు దళితులంటే మరీ అంత చులకనా..? అని అంటున్నారు.  అయనకు వ్యతిరేకంగా పలుచోట్ల న్యాయస్థానాలలో కేసులు దాఖలయ్యాయి.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు 24 గంటల్లో ఎస్సీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర, జాతీయ ఎస్సీ కమిషన్లకు ఫిర్యాదు చేస్తామని మంగళవారం మీడియాతో అన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఎస్సీలుగా ఎవరూ పుట్టాలనుకోరు అనడంతో చంద్రబాబు దళితులను అవమానిస్తున్నారన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: