బసవతారకం ఆసుపత్రి చైర్మన్ , హిందూపురం ఎమ్మెల్యే , అంతకు మించి నందమూరి నట సింహం అయిన బాలయ్య బాబు తానొక గిరి గీసుకుని అందులో కూర్చుండిపోయాడు అని విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యే గా రాజకీయపరంగా అయితే హిందూపురానికీ , చైర్మన్ గా అయితే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పరిదికీ , నటుడిగా అయితే సినిమా రంగానికీ బాలయ్య పరిమితం అయ్యారు అనీ ఈ పరిధి దాటి ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందరకు వెయ్యడం లేదు అని అంటున్నారు.

 

 

బాలకృష్ణ ని కేవలం ఒక టీడీపీ ఎమ్మెల్యే గా టీడీపీ యువత చూడ్డం లేదు. బాలయ్య మీద మొన్నటి వరకూ ' ఫ్యూచర్ సీఎం ' అంటూ ఎక్కడికి వెళ్ళినా నినాదాలు చేసారు. కానీ ఈ మధ్యన ఎక్కడా అలాంటి అరుపులూ, నినాదాలూ వినపడడం లేదు , బహుసా అలాంటి గోల చేసినవారికి టీడీపీ హై కమాండ్ నుంచి వార్నింగ్ లు ఒచ్చినట్టు ఉన్నాయి. బాలకృష్ణ కూడా రాజకీయ విషయాల్లో మాట్లాడినప్పుడు 'పదవి నా వద్దకు రావాలే తప్ప.. నేను పదవుల కోసం వెంపర్లాడను.. పదవి నాకు అలంకారం కాదు.. నేనే పదవికి అలంకారం..' అని చెబుతారు ఎప్పుడూ. ఆ రకంగా చూస్తే బాలకృష్ణ పదవుల విషయంలో మరీ సీరియస్ గా ఉన్నట్టు కనపడ్డం లేదు.

 

 

అదంతా ఓకే కానీ రాష్ట్రం లో మొన్నటికి మొన్న జరిగిన కాపుగర్జన, గొడవలూ ఇలాంటి విషయాల్లో బాలకృష్ణ స్పందించాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ లాంటి కుర్ర రాజకీయ నాయకులు జనాల్లో ప్రభావం తీసుకుని రావడం కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఈయనకి మంచి ఫాలోయింగ్ ఉండి కూడా సైలెంట్ గా ఉండడం గమనార్హం. తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీ లో బాలయ్య ఎప్పటికైనా పగ్గాలు చేపడతారు అనుకున్న అభిమానులని బాలయ్య నీరస పరుస్తూనే ఉన్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: