గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో కాపులకు రిజర్వేషన్ కల్పించాలని ముద్రగడ పద్మనాభం పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. అంతే కాదు కాపు గర్జన మహాసభ ఏర్పాటు చేయగా పెద్ద గందరగోళం ఏర్పడింది. తర్వాత ముద్రగడ తన స్వగృహంలోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఎట్టకేలకు ప్రభుత్వం మంత్రులను పంపించి ఆయన డిమాండ్స్ పరిశీలిస్తామని హామీ ఇచ్చి నిమ్మరసం తాపించారు. ఇంతవరకు బాగానే ఉన్న ఇప్పుడు బీసీ ల నుంచి మరో వ్యతిరేకత వస్తుంది.

కాపులను బిసిలో కలిపేస్తే తమకు అన్యాయం అవుతుందని బీసీ సంఘ నాయకులు అంటున్నారు. ఈ మేరకు నిన్నవ బీసి సమావేశ ఏర్పాటు కూడా చేశారు. తాజాగా విజయవాడలో రామవరప్పాడులో ఇంజినీరింగ్ విద్యార్ధి రవితేజగా కుల రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ సెల్ టవర్ ఎక్కాడు. దీంతో భారీ ఎత్తున జనాలు అక్కడ గుమిగూడారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతన్ని కిందికి దించేందుకు ప్రయత్నిస్తున్నారు.

దీనిపై పవన్ కళ్యాన్ స్పందించాలని పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం నుంచి హామీ వచ్చే వరకు తాను కిందకి దిగే ప్రసక్తే లేదని అతను తేల్చిచెప్పాడు. దీంతో ఏం చేయాలనే దానిపై అధికారుల తర్జన భర్జన పడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: