రెండు రోజుల క్రితం సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అనుశ్రీ(22) కనిపించకుండా పోయిందని సోషల్ మీడియాల్ వార్తలు హల్ చల్ చేశాయి.  ఎట్టకేలకు గచ్చిబౌలి నుంచి రెండు రోజుల క్రితం అదృశ్యమైన టిసిఎస్ సాఫ్టువేర్ ఇంజినీర్ అనుశ్రీ అచూకీని గుర్తించారు. ఆమె పటాన్‌చెరు సమీపంలోని ఓ చెరువు వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు, పోలీసులు గుర్తించారు. కర్ణాటకకు చెందిన అనుశ్రీ గచ్చిబౌలిలోని దివ్యశ్రీ ఉమెన్స్ పీజీ హాస్టల్లో ఉంటోంది.

సోమవారం ఆమె తనకు ఆరోగ్యం బాగోలేదని తండ్రి ప్రభాకర్కి ఫోన్ చేసింది. హైదరాబాద్కు వచ్చి హాస్పటల్కు తీసుకు వెళతానని కంగారు పడవద్దని కుమార్తెకు నచ్చచెప్పారు. అనంతరం అనుశ్రీకి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ప్రభాకర్ కర్ణాటక నుంచి హైదరాబాద్ వచ్చారు వెంటనే టీసీఎస్ కార్యాలయానికి వెళ్లగా అక్కడకు కూడా అనుశ్రీ రాలేదని చెప్పడంతో ప్రభాకర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. శివారు ప్రాంతాల్లో ఆమె సంచరించినట్టు గుర్తించారు. చివరకు పటాన్ చెరు సమీపంలో ఆమె ఆచూకీ కనిపెట్టారు. ఆమెను గచ్చిబౌలి పోలీసులకు అప్పగించనున్నారు. ఆమె సురక్షితంగా ఉందన్న సమాచారంతో తల్లిదండ్రులు, సహోద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: