భారత దేశాన్ని బ్రిటీష్ వాళ్లు పరిపాలించినపుడు మన దేశ సంపద చాలా వరకు అక్కడకు తరలించారు. అందులో భారత దేశ అమూల్య సంపద అయిన నెమలి సింహాసనం, కోహినూర్ వజ్రాన్ని కూడా తమ దేశానికి తీసుకు వెళ్లినట్లు చరిత్ర చెబుతుంది. తాజాగా కోహినూర్ వజ్రం పాకిస్థాన్ కి చెందినది గా అక్కడ ఓ న్యాయవాది వాదిస్తున్నాడు.  పాకిస్థాన్ కు చెందిన జావేద్ ఇక్బాల్ జాఫ్రీ అనే న్యాయవాది పంజాబ్ రాష్ట్ర లాహోర్ కోర్టులో పిటషన్ కూడా వేశారు.  ఆ వజ్రాన్ని పాక్‌కు తీసుకువచ్చేలా దాఖలైన ఓ పిటిషన్‌ను పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్ర లాహోర్ కోర్టు విచారణకు స్వీకరించింది.

భారత్, పాకిస్తాన్ ఉమ్మడిగా ఉన్న సమయంలో అప్పటి అవిభాజిత పంజాబ్ రాష్ర్టాన్ని పాలించిన మహారాజా రంజిత్‌సింగ్ మనవడు దిలీప్‌సింగ్ నుంచి కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ బలవంతంగా తీసుకు వెళ్లిందని.. అప్పుడు ఎలాంటి చట్టాలు లేవు.. కాబట్టి న్యాయంగా ఆ వజ్రం పాకిస్థాన్‌కు చెందాల్సిందే' అని తన పిటిషన్లో పేర్కొన్నాడు.

కిరీటంలో పొదిగిన కోహినూర్ వజ్రం


కోహినూర్‌పై తాను ఇప్పటివరకు బ్రిటన్ రాణికి, పాకిస్థాన్ ప్రభుత్వానికి 786 లేఖలు రాశానని కూడా పేర్కొన్నారు. ఇప్పటి వరకు పాకిస్థాన్ మనతో ప్రతిదానిలోనూ పోటీ పడుతున్న విషయం తెలిసిందే చివరకు ఈ కోహినూర్ వ్రజం విషయంలో పోటీకి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. మరి దీనికి భారత్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: