శనివారం తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఓ భారీ పేలుడు సంభవించి ఒక డ్రైవర్ ముగ్గురు విద్యార్థులు గాయపడిన  సంగతి తెలిసిందే. ఈ విషయం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆకాశం నుంచి ఉల్క పడడం వల్లే పేలుడు సంభవించి వ్యక్తి చనిపోయాడని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా అధికారికంగా ప్రకటించారు. చనిపోయిన వ్యక్తి ఉల్క వల్ల కాదని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ నాసా వెల్లడించింది.

ఉల్కాపాతంతో కామరాజు మృతిచెందలేదని తమకు ఆన్‌లైన్‌లో అందిన ఫోటోలను పరిశీలించగా అది అక్కడి భూమిలో సంభవించిన పేలుడుగా తెలుస్తుందని వివరించారు.ఆకాశం నుంచి వచ్చి పడిన శకలంతో పేలుడు జరిగినట్టు కనిపించడంలేదని తెలిపారు.

ఇప్పటి వరకు ఉల్కాపాతంతో మనిషి చనిపోయిన సంఘటన చరిత్రలో ఎన్నడూ జరగలేదని నాసా శాస్త్రవేత్త లిండ్లి జాన్సన్ పేర్కొన్నారు.ఈ ఘటనకు సంబంధించి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఫోటోలను పరిశీలిస్తే, పేలుడు నేల మీదే జరిగి ఉంటుందని ఆకాశం నుంచి పడినట్లు అనిపించడం లేదని నాసా తెలిపినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: