రాయలసీమ వాసులను చంద్రబాబు రౌడీలుగా చిత్రీకరిస్తున్నారు, జన్మభూమి కమిటీలకు సీఎం దోపిడి లైసెన్స్ ఇచ్చారు, ప్రజలకు దొరకుండా మంత్రులు తిరుగుతున్నారు. తాత్కాలిక రాజధానితో ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారు : రఘువీరా


ఏసీబీ వలలో ముండ్లమూరు (మం) పులిపాడు వీఆర్వో రమాదేవి, రూ.6 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో రమాదేవి.


విద్యానగర్ రైల్వే స్టేషన్ లో ప్రమాదం, దంపుతులు మృతి.


టీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వలసలు కొనసాగాయి, చేరికలను టీఆర్ఎస్ మొదలు పెట్టినట్లు రేవంత్ మాట్లాడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను ఏ ప్రలోభాలతో టీడీపీలోకి తీసుకువస్తున్నారు..? : ఎంపీ సుమన్


 టీడీపీలో మిగిలిన ఒకరిద్దరూ కూడా త్వరలో టీఆర్ఎస్ లోకి వస్తారు : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి


వచ్చే నెల మొదటి వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీలో సభ్యుల అనుచిత వ్యవహారంపై 25 లోగా నివేదిక, నివేదికను ప్రివిలైజ్ కమిటీకి పంపి అసెంబ్లీలో చర్చిస్తాం. నివేదిక ఆధారంగా సభ నిర్ణయం ప్రకారం సభ్యులపై చర్యలు : స్పీకర్ కోడెల


కోమాల ఉన్న జవాను హునమంతప్ప, పరిక్షిస్తున్న నిపుణులై వైద్య బృందం. రోజు రోజు కి దేశ వ్యాప్తంగా పెరుగుతున్న మద్దతు, ఆయన ఆరోగ్యం కుదుట పడాలని ప్రార్థనలు.


ఓటుకు నోటు కేసుతో నాకు సంబంధం లేదు, సంబంధం ఉంటే ఇప్పటికే నోటీసులు వచ్చేవి, టీడీపీలో నే కొనసాగుతా : మాగంటి గోపినాథ్


230 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్, 70 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టి. డాలర్ తో రూపాయి మారకం విలువు 68


ఢిల్లీలో కేంద్ర మంత్రి సురేష్ ప్రభును కలిసిన దత్తాత్రేయ. రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి. పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని కోరిన దత్తాత్రేయ.

సాయంత్రం టీ-టీడీపీ విస్తృత స్థాయి సమావేశం. హాజరు కానున్న చంద్రబాబు, రమణ,రేవంత్, ఇంచార్జీలు.


జీహెచ్ఎంసీ మేయర్ గా బొంతు రామ్మోహన్ ఏకగ్రీవ ఎన్నిక, డిప్యూటీ మేయర్ గా బాబా ఫసియుద్దీన్ ఏకగ్రీవ ఎన్నిక.


మేయర్, డిప్యూటీ మేయర్లకు మద్దతు తెలిపిన ఎంఐఎం


ప్రమాణ స్వీకారం చేసిన జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు. మూకుమ్మడిగా కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించిన రాహుల్ బొజ్జా.


తెలంగాణ భవన్ లో కార్పోరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యుల భేటీ, హాజరైన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, గ్రేటర్ మంత్రులు. కార్పోరేటర్లకు దిశానిర్దేశం చేసిన మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ పేరు ప్రతిపాదించిన మంత్రి జగదీష్ రెడ్డి.


ప్రజలు పూర్తి స్థాయిలో మెజార్టీ ఇచ్చారు. మేయర్ గా  రాంమ్మోహన్, డిప్యూటీ మేయర్ గా ఫసియుద్దీన్ పేర్లు ప్రకటించిన కేటీఆర్, 3 నెలల్లోపు స్టాండింగ్ కమిటీలను నియమించుకుందాం : కీటీఆర్

 

విశాఖలో భారత్-శ్రీలంక మూడో టీ-20 మ్యాచ్ కు టెకెట్ల విక్రయం. 14న విశాఖలో భారత్ – శ్రీలంక మద్య మూడో టీ-20 మ్యాచ్. టికెట్ల కోసం మీ – సేవా కేంద్రాల వద్ద బారులు తీరిన అభిమానులు. 6 కేటగిరీల్లో 12 వేల టికెట్ల విక్రయం

గుంటూరు జిల్లా రెంటచింతల (మం) పాల్వాయిలో విషాదం. పొలం వద్ద విద్యుత్ షాక్ తో అన్నదమ్ములు మృతి, మరోకరికి తీవ్రగాయలు.


ఆదిలాబాద్ జిల్లా బాసరలో వసంత పంచమి వేడుకలు. రేపు ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.


మేదక్ లో నేటితో ముగియనున్న నారాయణఖేడ్ ఉప ఎన్నిక ప్రచారం


ముంబై దాడుల కేసులో కొనసాగుతున్న ఉగ్రవాది హెడ్లీ విచారణ. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా హెడ్లీని ప్రశ్నిస్తున్న ముంబై కోర్టు, భారత్ లో దాడులకు ఐఎస్ఐ నిధులు సమకూర్చింది. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఆర్బీఐ కి దరఖాస్తు చేశా. ముంబై దాడికి ముందు తహపూర్ రాణా ముంబై వచ్చాడు.. ఐఎస్ ఐ మేజర్ ఇక్బాల్ నుంచి 25 వలే డాలర్లు తీసుకున్నా, నారీమన్ ఇండస్ ఇండ్ బ్యాంక్ నుంచి నగదు డ్రా చేసుకున్న : హెడ్లీ


సాయంత్రం టీ-టీడీపీ నేతలతో చంద్రబాబు బేటీ, తాజా రాజకీయా పరిణామాలపై చర్చ.


సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్, ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం కేసీఆర్. బడ్జెట్ లో తెలంగాణకు ప్రాధాన్యతమివ్వాలని కోరనున్న సీఎం కేసీఆర్.




మరింత సమాచారం తెలుసుకోండి: