అబ్బ .. ఇంతకు మించి గొప్ప వార్త ఉండదేమో. తెలుగు దేశం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయినా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చాలా సంతోషంగా ఉన్నారట. ఓటింగ్ శాతం తగ్గినా కూడా టీడీపీ కి అధికంగా లక్షన్నర ఓట్లు రావడమే దీనికి కారణం అని ఆయన చెబుతున్నారు.

 

 

 ఎన్నికల్లో గెలిస్తే హ్యాపీ ఓడిపోతే నిర్వేదం మామూలే కానీ ఓడినా కూడా తమదే పై చేయి అని చెప్పుకుంటున్నారు చిన్న బాబు గారు. గ్రేటర్ ఎన్నికలు చూస్తే ఎవ్వరికైనా టీడీపీ - బీజేపీ కూటమిని తెరాస ఏ రకంగా మట్టికరిపించిందో చెప్పేస్తారు. ఓట్లు ఒచ్చాయి, ఓటింగ్ పెరిగింది, మాకు ఇదివరకు మీద ఓట్లు పెరిగాయి అని కవరింగ్ తప్ప ఓటమిని ఒప్పుకుని దాని బాధ్యత ని నెత్తిన వేసుకున్న పాపాన పోలేదు చిన్నబాబు గారు. ఎన్నో సంవత్సరాల పార్టీ, హైదరాబాద్ మొత్తం తమదే అని విర్రవీగే పార్టీ కేవలం ఒక్కటంటే ఒకే ఒక్క సీటు తో గ్రేటర్ ఎన్నికలలో నిలించింది అంటే అంతకంటే సిగ్గుపడాల్సిన విషయం ఉండదు.

 

అంతటి దారుణ పరాభవానికి కారణం ఎవరు అనే విషయాన్ని వదిలేసి గుండు సున్నా మీద వెంట్రుక ని చూపించుకుని ఇదే మా జుట్టు అన్నట్టు ఉంది లోకేష్ వ్యవహారం. ఇప్పటికే గ్రేటర్ రిజల్ట్ చూసిన టీడీపీ అభిమానులూ, కార్యకర్తలూ లోకేష్ మీద చాలా కోపంగా ఉన్నారు అది చాలదు అన్నట్టు ఆయన గారి వీర లాజిక్ లు వారికి కొత్త విసుగు తెప్పిస్తున్నాయి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: