ఓటు కు నోటు కేసు లో రాత్రికి రాత్రి సూపర్ స్టార్ అయిన రేవంత్ రెడ్డి నీ అతనికి ఉన్న దూకుడు నీ సైకిల్ పార్టీ సరిగ్గా వాడుకోలేదు అనే విమర్శ తీవ్రంగా ఉంది. తెలంగాణా టీడీపీ దాదాపుగా ఖాళీ అయిపోయిన తరుణం లో నిన్న రాత్రి ఎర్రబెల్లి ఇచ్చిన షాక్ కి ఎవ్వరూ తేరుకునే పరిస్థితి లో లేరు. ప్రస్తుతం టీటీడీపీ లో వేళ్ళ మీద లెక్కపెట్టగలిగే అంత మంది మాత్రమె మిగిలి ఉన్నారు.

 

అంతకు మించి నేతల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. నేతలు పార్టీలు మారినా కార్యకర్తలు పార్టీతో నే ఉన్నారు అని కహానీలు చెప్పుకున్న చంద్రబాబు అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే నేతలు మారుతున్న సమయం లో క్యాడర్ తో పాటు కార్యకర్తలు కూడా తేలికగా షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. ఎర్రబెల్లి పార్టీ మారడమే కాక టీడీపీ ని వీడుతూ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం అని బల్లగుద్ది చెప్పడం లోనే కార్యకర్తలని కూడా తీసుకెళ్ళిపోతున్నారు అన్న విషయం అర్ధం అవుతోంది.

 

 

ఎలాంటి నాయకుడయినా పార్టీ మారిన వెంటనే చాలా హడావిడి చేస్తారు, బల ప్రదర్సన కి భారీ వేదిక ని ఏర్పాటు చేసి మరీ వేడుక జరుపుతారు. ఇంకా ముగ్గురు ఎమ్మెల్యే లు టీడీపీ నుంచి తెరాస కి రావడానికి ఉన్నారు అని ఎర్రబెల్లి అంటునారు, ఇది గనక నిజం అయితే చివరికి ఉండేది ఒకే ఒక్కరు ఆయనే రేవంత్ రెడ్డి. సండ్ర వెంకట వీరయ్య ఉన్నారు కానీ ఆయన పేరు పెద్దగా ఎక్కడా వినపడదు. సో టీడీపీ కి రేవంత్ రెడ్డి ఒక్కరే మిగిలే అవకాశం కనిపిస్తోంది. ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే రేవంత్ రెడ్డి మాత్రమే దిక్కు అయ్యి టీవీ లలో మాట్లాడడానికి కనిపిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: