తెలుగు రాష్ట్రాలో ఓటుకు నోటు వ్యవహారం పెద్ద సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఏప్రిల్ నెలలో ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా టిడిపి అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకోవడానికి ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు డబ్బులు ఇవ్వజూపినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో గతంలోనే తెలంగాణ ఏసీబీ అధికారులు తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలను అరెస్టు చేశారు.  కాగా ఓటు కోసం ఇవ్వజూపిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఏసీబీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టింది.

 హైదరాబాద్‌ నగర నడిబొడ్డున ఉన్న నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న టిడిపి ఎమ్మెల్యేకు దీనిలో పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభించినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.  తాజాగా ఓటుకు నోటు కేసులో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఏసీబీ దర్యాప్తులో మరిన్ని ఆధారాలు లభించినట్టు సమాచారం.  

ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టు అయిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి (ఫైల్)


రేవంత్‌రెడ్డి, గోపీనాథ్ నుంచే ఆ నగదు తీసుకుని స్టీఫెన్సన్ వద్దకు వెళ్లారని ఏసీబీ దర్యాప్తులో తేలినట్టు సమాచారం. తాజా ఆధారాలతో గోపీనాథ్‌కు వారెంటు జారీ చేసి, నేడో, రేపో అరెస్టు చేయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయడం, ఆయన షరతులతో కూడిన బెయిలుపై బయటికి రావడం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: