14 సంవ‌త్స‌రాల ఉద్య‌మ చ‌రిత్ర‌... రాష్ట్ర ఏర్పాటు అనంత‌రం మొద‌టి సారిగా ప్ర‌భుత్వం ఏర్పాటు... ముఖ్య‌మంత్రి గా తెలంగాణ రాష్ట్రానికి ఆయ‌న చేయాల్సిన ప‌ని ఎంతో ఉన్నా..  గులాబీ పార్టీ ఎదుగుద‌ల‌కు సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు ఇంతా అంతా కాదు.  తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మిగిలేలా గులాబీ నేత కేసీఆర్ చేస్తున్న వ్యూహాలు దాదాపుగా ఫ‌లిచిన్న‌ట్టే న‌ని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉంటే అది కేవలం టీఆర్ఎస్ పార్టీ యే అయ్యి ఉండాల‌న్న కేసీఆర్ పాల‌సీ దాదాపుగా నిజ‌మ‌య్యేలా పావులు క‌దుపుతున్నారు కేసీఆర్ అండ్ కో. గులాబీ ఉద్య‌మ నేత‌గా ఆయ‌న గ‌తంలో తీసుకున్న నిర్ణ‌యాలకంటే... ఇప్పుడు తాజాగా పార్టీ కోసం తీసుకుంటున్ననిర్ణయాలు సంచ‌ల‌నంగానే చెప్పొచ్చు. పార్టీ అధికారంలోకి వ‌చ్చి 20 నెల‌ల కావ‌స్తున్నా.. అభివృద్ధి ప‌థ‌కాల‌కు పెద్ద పీఠ వేస్తూనే... మ‌రోవైపు పార్టీ క్యాడ‌ర్ పెంచుకునే ప్ర‌య‌త్నం లో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తో ఇత‌ర పార్టీల సీనియ‌ర్ నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తూ వ‌స్తున్నారు.


అయితే కేసీఆర్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్  కేవ‌లం టీడీపీ నాయ‌కుల‌పైనే ఎక్కువ‌శాతం ప్ర‌భావితం అయ్యేలా ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే కేసీఆర్ టీడీపీ నాయ‌కత్వం విచ్చినం చేసి పార్టీలోకి తీసుకోవ‌డం వ‌ల్ల‌... ఉమ్మడి ఆంద్ర ప్ర‌దేశ్ లో ప్రాంతీయ పార్టీ గా పేరొందిన టీడీపీని కేవ‌లం న‌వ్యాంద్ర కే ప‌రిమితం చేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే తెలంగాణ ప్రాంతంలో టీడీపీ నేతలంతా దాదాపుగా గులాబీ కండువా క‌ప్పుకున్నారు. 20 నెల‌లుగా వ‌ల‌స‌ల ప‌ర్వం కొన‌సాగుతూనే ఉన్నాయి. గ‌త కొన్ని నెల‌ల క్రితం గ్రేట‌ర్ హైద‌రాబాద్ టీడీపీ నేత‌, స‌న‌త్ న‌గ‌ర్ ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ నుంచి మొద‌లైన ఈ వ‌ల‌స‌ల ప‌ర్వం... తాజాగా ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వ‌రకు సాగుతూనే ఉంది. మొద‌ట‌గా త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ తన పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసి గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు.  ఆ వెనువెంట‌నే తీగ‌ల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిష‌న్ రెడ్డి, మాధ‌వ‌రం కృష్ణారావు లు త‌ల‌సాని బాట ప‌ట్టారు. తాజాగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల నేఫ‌ధ్యంలో టీడీపీ నేత‌లు సాయ‌న్న గులాబీ గూటి లో చేరిపోయారు. 


నిన్న‌టి నిన్న కుత్బులా పూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గులాబీలో చేరగా..  మ‌రో టీడీపీ సీనియ‌ర్ నేతలు బీసీ నాయకులు పాల‌కుర్తి ఎమ్మెల్యే ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు,  రాజేంద్ర‌న‌గ‌ర్ ఎమ్మెల్యే ప్ర‌కాశ్ గౌడ్ దాదాపుగా కేసీఆర్ చేతిలో పావులుగా మారారు. నిన్న గులాబీ నేత కేసీఆర్ స‌మ‌క్షంలో పార్టీలో చేరిపోయారు.  దీంతో  తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ అడ్రస్ గల్లంతయ్యినట్టే న‌ని ప‌ల‌వురు రాజ‌కీయ మేధావులు భావిస్తున్నారు. ఇక్క‌డ మ‌రోవిష‌యం గురించి మాట్లాడాలి. ఇంత వ‌ర‌కు ఆయ‌న ఒక‌టి ఇద్ద‌రు నాయ‌కులు  త‌ప్ప ఎక్కువ శాతం టీడీపీ నాయ‌కుల‌నే పార్టీలోకి ఆహ్వానించారు.  కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి డీఎస్,  కే కేశ‌వ‌రావు, మంధ జ‌గ‌న్నాధ్  లు త‌ప్ప దాదాపుగా టీడీపీ వ‌ర్గానికి చెందిన వారేన‌న్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. అయితే ఆయ‌న తీసుకున్న వ‌ల‌స‌ల వెనుక ఓ గ‌ట్టి ఉద్దేశ్య‌మే ఉంద‌న్న‌ది ఇట్టే అర్ధ‌మవుతుంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఏర్ప‌డ్డ  తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్ర ప్రాతీయ పార్టీ గా గుర్తింపు పొందింది. అయితే జాతీయ పార్టీలైన ఎన్డీఏ కూట‌మి, బీజేపీల‌తో పొత్తు పెట్టుకుంటూ కేంద్రంలో చ‌క్రం తిప్పుకుంటూ వస్తోంది. 


అయితే తాజాగా తెలుగు రాష్ట్రాలు విడిపోయిన త‌రువాత ఆంధ్ర‌ప్రదేశ్ లో టీడీపీ.. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బ‌ల‌మైన రాజ‌కీయ పార్టీగా ఎదుగుతూ వ‌చ్చాయి. కానీ  టీడీపీ మాత్రం జాతీయ పార్టీగా మారి రెండు రాష్ట్రాల్లో త‌న పార్టీ అధికారంలోకి రావాల‌ని తాప‌త్ర‌యంతో అడుగులు వేస్తూ వ‌చ్చింది. దీనిని గ‌మ‌నించిన గులాబీ నేత  సీఎం కేసీఆర్ త‌న‌దైన శైలీ లో పావులు క‌దుపుతూ తెలంగాణ లో టీడీపీ కీల‌క నేత‌ల‌ను ఆప‌రేషన్ ఆక‌ర్ష్ తో పార్టీ లోకి ఆహ్వానించారు. అంతేకాకుండా.. తెలంగాణ బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఉండేలా త‌మ వ్యూహాలు ర‌చించ‌డ‌మే కాదు.. అందులో స‌ఫ‌ల‌మ‌య్యారు. అయితే.. గ‌త రాష్ట్ర విభ‌జ‌నానంత‌రం న‌వ్యాంధ్ర‌లో అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ నేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కేవ‌లం ఏపీ ప్రాంత పైనే దృష్టి పెట్టారు. దీంతో ఆయ‌న  తెలంగాణ‌లో పార్టీ అభివృద్ది క‌నీసం ఏ మాత్రం  జోక్యం చేసుకోలేదు. అయినా ఇప్ప‌టికే ఆయ‌న తెలంగాణ ఉద్య‌మ కాలంలో చేసిన వ్యాఖ్యాలు తెలంగాణ మైనస్సేన‌ని చెప్పాలి. 


ఉద్య‌మ స‌మ‌యంలో రెండు క‌ళ్ళ సిద్దాంతంతో తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని గులాబీ ద‌ళం తెలంగాణ  ప్రాంతంలో గొప్ప చాటింపే వేశారు.  దీంతో చంద్ర‌బాబు మాట‌లు తెలంగాణ ప్ర‌జ‌ల అంత‌గా విశ్వ‌సించలేదు. దీనిని అస‌రా గా చేసుకుని టీఆర్ఎస్ కు  టైం దొరికిన‌ప్పుడ‌ల్లా చంద్ర‌బాబు ను విమ‌ర్శనాస్త్రాలు సందించారు. దీంతో దాదాపుగా చంద్రబాబు తెలంగాణ ప్రాంతం వారు విల‌న్ గా చూశారు. మొన్నీమ‌ధ్య కాలంలో గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఈ - క్యాంపేయిన్ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... చంద్ర‌బాబు ఉద్దేశించి చాలా ప్ర‌క‌ట‌న‌లే చేశారు. చంద్ర‌బాబు ఏపీ సీఎంగా ఉంటే... తెలంగాణ కు నేను సీఎం గా ఉన్నాను. నేను తెలంగాణ అభివృద్ది చేస్తాను. నీవు నీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవల్సిందిగా విజ్ఞ‌ప్తి చేశారు. అంతే  కాకుండా ఆయ‌న తెలంగాణకు ఏం పనంటూ గ‌ట్టి సెటైర్లే వేశారు. ఇక‌పోతే గ‌త  కొంత‌కాలంగా చంద్ర‌బాబు దాదాపుగా ఏపీ ప్రాంతానికే పరిమిత‌మౌతూ వ‌స్తున్నారు. ఇప్పుడు తెలంగాణ‌లో దాదాపుగా టీడీపీ ని బ‌లోపేతం చేసే నాయ‌కులు క‌రువ‌య్యారు. ఒక్క‌రిద్ద‌రు కీల‌క నేత‌లు త‌ప్ప దాదాపుగా టీటీడీపీ ఖాళీ అయ్యింది. 


దీంతో ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో గులాబీ పార్టీయే  ప్ర‌ధాన పాంత్రీయ పార్టీగా అభివృద్ధి చెంద‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యింద‌నే చెప్పాలి. తాజాగా ఆ పార్టీ నేత ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయ‌న చేసిన సంచ‌ల‌న వ్యాఖ్యాలే చేశారు. తెలంగాణ లో టీడీపీ బ్ర‌తికే అవ‌కాశం లేద‌ని తెలిపారు. మ‌రో ఇద్ద‌రు ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం టీఆర్ఎస్ చేరే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. అంటే దీనిని బ‌ట్టి గ‌మ‌నిస్తే టీడీపీ టీఆర్ఎస్ పార్టీ విలీనం అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గానే ఉన్నాయి. కేసీఆర్ సంకల్పించిన విధంగా తెలంగాణ లో టీఆర్ఎస్ బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీగా ఉండబోతుందన్నది నిజం. అదే స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ కేవ‌లం ఏపీ ప్రాంతానికే పరిమితం కావడం సుస్ప‌ష్టం. దీనికి గ‌మ‌నిస్తున్న టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్ర‌బాబు ఏపీ కే ప‌రిమిత‌మౌతారా లేదా పార్టీ బ‌లోపేతానికి మరెమైన సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటారా  చూడాలి మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి: