భారత దేశం ఓ వీరజవాన్ని కోల్పోయింది. గత ఆరు రోజులుగా సియాచిన్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మృత్యువుతో పోరాడుతున్న జవాన్ లాన్స్‌నాయక్ హనుమంతప్ప (33) తుది శ్వాస విడిచారు.  హనుమంతప్ప మరణించినట్లు ఆర్మీ పేర్కొంది.ఆరు రోజులు మంచు చరియల కింద, ఆ తర్వాత హాస్పటల్లో మృత్యువుతో పోరాడిన జవాను హనుమంతప్ప ఇవాళ ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో కన్నుమూశాడు. యన ప్రాణాలు కాపాడేందుకు ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

గురువారం 12 గంటల ప్రాంతంలో హనుమంతప్ప కనుమూశారు.సియాచిన్ కొండపై మృత్యుంజయుడిగా బయటపడ్డ హనుమంతప్ప తిరిగి కోలువాలని గత రెండు రోజులు దేశవ్యాప్తంగా ప్రజలు పూజలు, ప్రార్థనలు చేశారు. ఆయన్ను కాపాడేందుకు ఆర్మీ వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు. హనుమంతప్ప శరీరం చికిత్సకు సహకరించలేదు. ఈనెల 3న సియాచిన్‌లో విరిగిపడ్డ మంచు చరియల కింద హనుమంతప్ప చిక్కుకున్నాడు.

సియాచిన్‌ ప్రమాదంలో హనుమంతప్ప


ఆయన కోలుకోవాలని యావత్ భారత దేశం చిన్నా పెద్దా, సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు అందరూ ప్రార్థించారు. అంతే కాదు తమ అవయవాలు కూడా దానం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కానీ మృత్యువుతో పోరాడిన వీరజవాన్ తుద శ్వాస విడవడంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: