ఆ మద్య మార్గదర్శి ఫైనాన్స్‌కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారని  రామోజీరావు పై రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపణలు చేసిన విషయం తెలిసందే. చాలా కాలం  తర్వాత మళ్లీ తెరపైకి ఆ విషయాన్ని తీసుకు వచ్చారు ఉండవల్లి. అంతే కాదు మార్గదర్శి ఫైనాన్స్‌ ఆరోపణలు ఎదుర్కొన్న ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడంపై ఉండవల్లి తీవ్ర అభ్యంతరం చెప్పారు.

ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు మార్గదర్శి కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న రామోజీరావుకు పద్మ విభూషణ్ ఇవ్వడమేమిటని అని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాదు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయనకు ప్రకటించిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని తనపై ఉన్న కేసుల నుంచి రామోజీరావు బయటపడలేదని, ఎంతో మంది అమాయక ప్రజల నుంచి ఆయన డబ్బు వసూలు చేశారని అరుణ్ కుమార్ ఆరోపణలు చేశారు.

ఉండవల్లి అరుణ్ కుమార్, రామోజీరావు


ఈ విషయాలను ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. గతంలో తాను రామోజీరావు బాగోతాలను బయటపెట్టినప్పుడు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా విచారణకు ఆదేశించారని, ఇప్పుడు ఆ విచారణ పూర్తి కాకుండానే అవార్డు ప్రకటించేశారని అంటూ, విచారణ జరిపించాలని కోరుతూ జైట్లీ రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: