ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తూ..ప్రజలను చైతన్య వంతులుగా మార్చే బాధ్యత విలేఖరులపై ఉంటుంది. గతంలో ప్రింట్ మీడియాతో ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చారు..నేడు చానల్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రత్యక్ష కథనాలతో ప్రజలను ప్రభావితం చేస్తుంది మీడియా.  తాజాగా టివి 5 ఎడిటర్ , ప్రముఖ రచయిత అరుణ్ సాగర్ కన్నుమూశారు.  మేల్ కొలుపు, తదితర రచనలు చేసిన అరుణసాగర్ గుండె పోటు కారణంగా మరణించారు.

హఠాత్తుగా గుండె పోటు రావడంతో వెంటనే సాగర్ ని అమీర్ పేట లోని ఒక ఆస్పత్రికి ఆయనను తరలించి వైద్యం అందించినా పలితం దక్కలేదు. జర్నలిజంపై మక్కువతో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకోవాలని అరుణసాగర్ విశాఖపట్నంలో పోస్టుగ్రాడ్యుయేషన్ చేశారు. టివి 9 లో చాలాకాలం వివిధ బాద్యతలు నిర్వహించిన ఆయన ఆ తర్వాత 10 టివిలో పనిచేశారు. ఆ తర్వాత టీవి 5 లో ఎడిటర్ గా బాధ్యతలు చేపట్టారు.

చిన్న వయసులోనే టీవీ రంగంలో ఎన్నో బాధ్యతాయుతమైన విధులు నిర్వహించిన సాగర్ అకార మరణంపై తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అల్లం నారాయణ మీడియా సిబ్బంది, ప్రముఖులు  సంతాపం ప్రకటించారు.అరుణ సాగర్ కు ఏపీహెరాల్డ్.కామ్ తరుపునుంచి శ్రద్దాంజలి ఘటిస్తున్నాం.



మరింత సమాచారం తెలుసుకోండి: