తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు మరీ బలం పుంజుకుంటుంది..ఇక తెలంగాణలో టీఆర్ఎస్ కి ఏకైక ప్రతిపక్షంగా ఉంటుందనుకున్న టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కోక్కరుగా టీఆర్ఎస్ లోకి వలసబాట పట్టారు. ఈ వారంలోనే కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ టీఆర్ఎస్ లోకి రాగా నిన్న టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్, ప్రకాశ్ గౌడ్ లు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే ఎర్రబెల్లి ఇచ్చిన ట్విస్ట్ కంప్లీట్ కాకముందే మహబూబ్‌ నగర్‌ జిల్లా నారాయణపేట్‌ టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఆయన మంత్రి హరీష్‌రావుతో చర్చలు జరిపారు. అనంతరం తాజ్‌ కృష్ణ హోటల్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు అభివృద్ది మాత్రమే కాంక్షిస్తున్నారు..అధికార పార్టీ చేస్తున్న అభివృద్ది పనులు మెచ్చుకోనే ఆ మద్య వరంగల్ ఉప ఎన్నికల్లో, మొన్న జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి అత్యధిక మెజార్టీతో గెలిపించారు.

ఏదేమైనా అందరి లక్ష్యం ప్రజా సంక్షేమం అందుకే టీఆర్ఎస్ పార్టీలో ఉంటే అది మరింత సాధ్యమవుతుందనే ఆకాంక్షతో నేను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ నుంచి వచ్చాక ఆయన సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో అధికారికంగా చేరనున్నట్లు ప్రకటించారు. రాజేందర్‌రెడ్డి చేరికతో టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: