తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రతి పక్ష పార్టీల నుంచి వలస బాటలు ఎక్కువే అయ్యాయి. చిన్న చిన్నగా ఇక్కడ టీఆర్ఎస్ బలం పుంజుకోవం మొదలైంది. అంతే కాదు ఆ మద్య వరంగల్ ఉప ఎన్నికల్లో, మొన్న జరిగిన గ్రేటర్ ఎలక్షన్స్ లో ప్రతిపక్ష పార్టీలకు సింగిల్ డిజిట్ మాత్రమే మిగిలిందంటే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రాబల్యం ఏ విధంగా ఉందో వేరే చెప్పనక్కరలేదు. ఇక పోతే తెలంగాణ టీఆర్ఎస్ ఏకైక ప్రతిపక్ష పార్టీ అంటూ మొన్నటి వరకు బీరాలకు పోయిన టీడీపీ ఇప్పుడు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నా ఎమ్మెల్యేలు.

మొన్నటి మొన్నవివేక్, ఎర్రబెల్లి,ప్రకాశ్ గౌడ్..ఈ రోజు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు స్పీకర్ మదుసూదనాచారికి ఒక లేఖ రాస్తూ టిఆర్ఎస్ లో విలీనం అవడానికి పది మంది ఎమ్మెల్యేలు అంగీకరించారని తెలిపారు.గురువారం నాడు టిఆర్ఎస్ కార్యాలయంలో సమావేశం అయి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.  రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ 4వ నిబంధన ప్రకారం తమ విలీనానికి అనుమతి ఇవ్వాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు.

ఎర్రబెల్లి లేఖ రాయంలపై ఇక్కడ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి దయాకరరావు, సాయన్న, ప్రకాశ్ గౌడ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాధవం కృష్ణారావు, కేవీ వివేకానంద గౌడ్, ధర్మారెడ్డి, రాజేందర్ రెడ్డి సంతకాలు చేశారు.దీంతో తెలంగాణ శాసనసభ లో టిడిపి పక్షం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు దీనిపై రేవంత్ రెడ్డి ఎలాంటి వివాదాలు తీసుకు వస్తే ముందు ముందు ఏంజరుగుతుందో వేచి చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: