సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు స్పీకర్ మదుసూదనాచారికి ఒక లేఖ రాస్తూ టిఆర్ఎస్ లో విలీనం అవడానికి పది మంది ఎమ్మెల్యేలు అంగీకరించారని తెలిపారు.గురువారం నాడు టిఆర్ఎస్ కార్యాలయంలో సమావేశం అయి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.  రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ 4వ నిబంధన ప్రకారం తమ విలీనానికి అనుమతి ఇవ్వాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. సభాపతికి ఎర్రబెల్లి లేఖ నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ పైన చర్చించేందుకు తెలంగాణ టిడిపి సభ్యులు జాతీయ అధ్యక్షులు చంద్రబాబుతో భేటీ కానున్నారు.  ఎర్రబెల్లి తన స్వంత నిర్ణయాలు ఓ ప్రాంతీయ పార్టీ పై ఎలా తీసుకుంటారని ఆయన ఏకపక్షంగా లేఖ రాశారని రేవంత్ రెడ్డి మండిపడుతున్నారని తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి, మిగిలిన టిడిపి సభ్యులు శుక్రవారం నాడు సభాపతిని కలిసే అవకాశముందని తెలుస్తోంది.కాగా, తమను అసలైన టిడిపిగా గుర్తించాలని ఎర్రబెల్లి దయాకర రావు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖలో ఎర్రబెల్లి సహా తెరాసలో చేరిన ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: