నేషనల్‌ హెరాల్డ్‌ కేసుకు సంబంధించి సోనియా, రాహుల్‌ గాంధీలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో కోర్టుకు వ్యక్తిగత హాజరయ్యే విషయంలో సుప్రీంకోర్టు వారికి మినహాయింపు ఇచ్చింది. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో సోనియా, రాహుల్ సహా కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.  వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని.. సోనియా, రాహుల్ దాఖలు చేసిన పిటిషన్‌ ను విచారించిన సుప్రీం.. వారి విజ్ఞప్తిని మన్నించింది.

ఐతే తమకు నోటీసుల నుంచి మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థనకు మాత్రం నో చెప్పింది. ఆ మద్య ఈ కేసు విచారణలో భాగంగా సోనియా, రాహుల్ తొలిసారిగా కోర్టు మెట్లెక్కారు. అయితే ప్రతిసారి ఈ ఇద్దరు కోర్టు హాజరుకావాల్సి వస్తుందేమోనన్న ఆందోళనతో వారిద్దరూ ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

పిటిషన్ పై సమగ్ర విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు వ్యక్తిగత హాజరు నుంచి వారిద్దరికి మినహాయింపునిచ్చింది. అంతే కాదు ఐతే నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా, రాహుల్ లకు వ్యక్తిగత మినహాయింపు విషయంలో ఢిల్లీ హైకోర్టు అతిగా వ్యవహారించిందని కూడా సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. 


సుప్రీం కోర్టు


ఈ సందర్భంగా శుక్రవారం న్యాయవాది అభిషేక్‌ మను సంఘ్వీ మీడియాతో మాట్లాడుతూ మోసం, విశ్వాస ఘాతుకం లాంటవేమీ అందులో లేవని అన్నారు. అదో చారిటబుల్‌ ట్రస్ట్‌ అని, ఈ దశలో ఒక ముగింపునకు రావడం సరికాదని న్యాయస్థానం చెప్పిందని ఆయన చెప్పారు. నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారంలో తప్పుడు ఆరోపణలతో కొందరు కోర్టుకు వెళ్లారని ఆయన అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: