తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, టీడీపీ ల నుంచి సీనియర్ నేతల నుంచి కార్యకర్తల వరకు చాలా మంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక గ్రేటర్ ఎన్నికల తర్వాత టీడీపీ  సీనియర్ నేతలు ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, వివేక్,ప్రకాశ్ గౌడ్,రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ మద్య వరంగల్ ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుపొందింది.

తాజాగా మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్‌ ఈ రోజు ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. ఎన్నికల కమిషన్ 286 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. లక్షా 88వేల 236 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

65 సున్నిత ప్రాంతాలు, 54 అతిసున్నిత ప్రాంతాలను గుర్తించారు. ప్రస్తుతం ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఎన్నికలు పూర్తి కట్టుదిట్టంగా కొనసాగుతుంది. టీఆర్ఎస్ నుంచి మహారెడ్డి భూపాల్‌ రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా కిష్టారెడ్డి కుమారుడు పటోళ్ల సంజీవరెడ్డి, టీడీపీ తరపున మహారెడ్డి విజయ్‌పాల్‌రెడ్డి, శ్రమజీవి పార్టీ నుంచి జె.భాస్కర్‌ బరిలో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: