తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తండోప తండాలు గా వస్తుంటారు. గిరిజన జారత అయినప్పటికీ ఇక్కడ కొలువు తీరిన  సమ్మక్క సారలమ్మలు భక్తులు కోరికలు తీర్చే మహాదేవతలని నమ్ముతారు. అందుకే ఇక్కడ బంగారాన్ని (బెల్లం) సమర్పించుకొని తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇక మేడారం జాతరకు భక్తులను తరలించడానికి తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే నాలుగు వేల బస్సుల సర్వీసుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఇక  భక్తుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సీపీఆర్వో ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.


సికింద్రాబాద్ -వరంగల్- సికింద్రాబాద్ ప్రత్యేక 8 రైళ్లు…


రైలు నం.07436 సికింద్రాబాద్ – వరంగల్ మెము ప్రత్యేక రైలు 17 నుంచి 20 ఫిబ్రవరి వరకు సికింద్రాబాద్ నుంచి ఉదయం 09.30 గంటలకు బయలుదేరి వరంగల్ మధ్యాహ్నం 12.45 చేరుకుంటుంది.
రైలు నం.07437 వరంగల్ – సికింద్రాబాద్ మెము ప్రత్యేక రైలు 17 నుంచి 20 వరకు వరంగల్ నుంచి మధ్యాహ్నం 1.20 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు సాయంత్రం 04:30 చేరుకుంటుంది.


జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు  : 


ఈ నెల 17 నుంచి జరిగే మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపనుంది. జిల్లాలో మొత్తం 7 డిపోలు ఉండగా ఇందులో నల్లగొండ. దేవరకొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, యాదగిరిగుట్ట, నార్కట్‌పల్లి డిపోలలో సుమారు 780 బస్సులు ఉన్నాయి. ఇందులో మేడార జాతర కోసం ప్రత్యేకంగా 300 బస్సులు నడుపనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: