తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఒక సంవత్సరం పాటు ఇరు రాష్ట్రాలు ఎలాంటి విషయాల్లో పోటీ పడకుండా తమ రాష్ట్రాభివృద్ది కార్యక్రమాల్లో మునిగిపోయారు. అయితే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఇరు రాష్ట్రాల్లో ముసలం మొదలైంది. ఇక ఓటుకు నోటు వ్యవహారం పెద్ద సంచలనమే రేకెత్తించింది. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్సీ అయిన స్టీఫెన్ సన్ కి డబ్బులు ఎర చూపించడం మొత్తం సీసి కెమెరాలో బంధించారు ఏసీబీ దీంతో ఆయనను కస్టడీలోకి తీసుకొని చర్లపల్లి జైలుకి తరలించారు.

తర్వాత బెయిల్ పై రేవంత్ రెడ్డి విడుదల కావడం జరిగింది. ఓటుకు నోటు కేసు ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 లాంటివి బయటకు రావడం దీంతో కేంద్ర పెద్దలు జోక్యం చేసుకోవడంతో ఈ కేసు కాస్త సర్ధుమణిగింది. తాజాగా ఇప్పుడు మళ్లీ  ఈ కేసు తెరపైకి వచ్చింది..ఓటుకు నోటు కేసులో విచారణకు హాజరుకావాలని జెరూసలేం మత్తయ్యకు తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.

ఉప్పల్‌లోని మత్తయ్య ఇంటికి వెళ్లి ఈ నోటీసులు అందజేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు మత్తయ్యను అరెస్టు చేయబోమని అధికారులు స్పష్టం చేశారు.  కాగా ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడిగా మత్తయ్య ఉన్న విషయం తెలిసిందే. ఏసీబీ ఏఎస్పీ మల్లారెడ్డి నేతృత్వంలో ఉప్పల్‌లో ఉన్న మత్తయ్య ఇంటికి వెళ్లి సెక్షన్ 160 సీఆర్‌పీసీ కింద ఈ నోటీసులు అందించారు. రోడ్ నెం.12, బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో గల ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేటింగ్ యూనిట్ కార్యాలయానికి ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోగా హాజరు కావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: