రేపే ప్రేమికుల దినోత్సవం, ప్రేమించుకుని తైతక్క లాడితే సరిపోదు పెళ్లి చేసుకోండి అంటూ ఎన్నో సంవత్సరాల నుంచీ లవర్స్ ని బెంబేలు ఎత్తిస్తున్నారు కొందరు. శ్రీరాం సేన , భజరంగ్ దళం, వీహెచ్పీ పేరు ఏదైనా కావచ్చు గానీ వారి వారి పంథా ఒక్కటే. ఇప్పుడు కొత్తగా మరికొన్ని సంస్థలు వీళ్ళతో చేతులు కలుపుతున్నట్టు తెస్లుస్తోంది. ప్రేమికుల స్వేచ్చ కి భంగం కలిగిస్తూ ప్రేమించుకునే హక్కుని కాలరాస్తూ వీరి అగాడాలు సాగుతున్నాయి అనేది లవర్స్ మండిపాటు.

 

 

 

ఒక పక్క రాజకీయ నాయకులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉండగా మరొక పక్క ప్రేమికుల ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. తాళి బొట్లు చేత పట్టుకుని మరీ రేపు మొత్తం రోడ్ ల మీద పడబోతున్నారు వీరు. పార్కులకి వెళ్ళకుండా జాగ్రత్త పడడమే బెటర్ అనుకుంటున్నారు ప్రేమికులు కూడా. ఇది ఇలా ఉంటె ఇండియన్ లవర్స్ సొసైటీ వారు పోలీసులని కలిసి తమకి భద్రత కల్పించాలి అని కోరుతున్నారు. రేపు పార్కులు మొత్తం నిండి పోతాయో లేక భజరంగ్ దళం దెబ్బకి భయపడి ఎవరూ బయటకి రాకుండా ఉంటారో చూడాలి.

 

 

 

మీడియా సాక్షిగా భాజరంగ్ దళ్ లాంటి వారి ఎదుట లవర్ కి తాళి కట్టాల్సిన పరిస్థితి ఎదురైతే అది టీవీల్లో ప్రపంచం అంతా చూస్తే ప్రేమికులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఒస్తున్నాయి. సంవత్సరం మొత్తం పార్కుల్లో ఉన్నవారిని ఒదిలేసి కేవలం ప్రేమికుల దినోత్సవం రోజున మాత్రమే ఈ హడావిడి ఏంటి అనేవారు కూడా లేకపోలేదు. ఏదేమైనా మీకు బాయ్ ఫ్రెండ్ / గర్ల్ ఫ్రెండ్ ఉంటే రేపు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి.


మరింత సమాచారం తెలుసుకోండి: