భారత దేశంలో రోడ్డు రవాణా సంస్థ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలను మాత్రం అరికట్ట లేకపోతున్నారు. ప్రతిరోజు ఎక్కడో అక్కడ హైవేలపై రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి రోడ్డు ప్రమాదాలు కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల..నిద్ర లేమితో జరుగుతుంటాయి..మద్యం సేవించి డ్రైవింగ్ చేయడంతో ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా బీహార్‌లోని రోహతస్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో 11 మంది అక్కడిక్కడే మృతి చెందగా మరో పదమూడు మంది తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ట్రక్కు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతుల స్వస్థలం భోజ్‌పూర్ జిల్లాలోని కుష్మా గ్రామం.

రోహతస్ జిల్లాలోని గుప్తధామ్ వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొని తమ సొంత గ్రామానికి తిరిగి వస్తుండగా ప్రమాదం సంభవించింది.అయితే ఈ ప్రమాదం కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: