తెలంగాణ రాష్ట్రం  2016-17 బడ్జెట్‌ రూ. 1.35 లక్షల కోట్లతో తయారు చేయబోతున్నట్టు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ ప్రకటించారు. ప్రస్తుత బడ్జెట్‌పై రూ. 20వేల కోట్లు పెరగబోతుంది. అనేక పథకాలకు నిధుల కేటాయింపు పెరుగు మందిని అప్పుడే ప్రజలను ఊహాసౌధాలలో విహరింపజేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 1,00,638 కోట్లతో ప్రవేశపెట్టారు. దీని ఆదాయ, వ్యయాలు మరుసటి సంవత్సరం (2015-16)లో చూపకుండానే రూ. 1,15,689 కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. 2016-17 బడ్జెట్‌లో గత రెండేండ్ల ఆదాయ, వ్యయాలను విధిగా చూపాల్సి ఉంటుంది.


కాగా 2016-17 బడ్జెట్ అంచనాల సమీక్షలో భాగంగా శుక్రవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఎస్ నిరంజన్‌రెడ్డి మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమం, సీనియర్ సిటిజన్స్ శాఖ, ఆర్థిక, ప్రణాళిక, హోం, మున్సిపల్ పరిపాలన, పట్టణ అభివృద్ధి శాఖలకు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు గడిచిన మూడురోజులుగా బడ్జెట్ అంచనాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. గత సంవత్సరపు బడ్జెట్, ఖర్చులతోపాటు 2016-17 సంవత్సరపు పద్దులవారీగా ప్రతిపాదించిన అంచనాలు, స్టేట్ నార్మల్ ప్రణాళికతోపాటు కేంద్ర ప్రాయోజిత పథకాలు తదితర అంశాలపై చర్చించారు.


 2016-17 బడ్జెట్ పై సమీక్షా సమావేశం

home1

ఈ సమావేశాలలో ప్రభుత్వ సలహాదారులు ఏకే గోయల్, జీఆర్ రెడ్డి, మున్సిపల్ పాలన, పట్టణాభివృద్ధిశాఖ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్‌త్రివేదీ, ఎస్‌పీఎఫ్ డీజీ తేజ్‌దీప్‌కౌర్ మీనన్, మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి ఎం జగదీశ్వర్, హెచ్‌ఎండీఏ కమిషనర్ టీ చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: