తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడ అభివృద్ది కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే..ఇక కేంద్ర మంత్రి బాధ్యతలు తీసుకున్న బండారు దత్తాత్రేయ 2016-17 రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మంత్రి బండారు దత్తాత్రేయ కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభుని కలిసి 2016-17 రైల్వే బడ్జెట్ లో సౌత్ సెంట్రల్ రైల్వేకు రూ. 2,500 కోట్లు కేటాయించాలని కోరారు.  హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాలలో ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణకు రూ. 200 కోట్లు కేటాయించాలని అడిగారు.

కాజీపేటను కొత్త డివిజన్ గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.  ఘట్ కేసర్ నుంచి భువనగిరి, భువనగిరి నుంచి యాదగిరిగుట్ట, లింగంపల్లి నుంచి శేరి లింగంపల్లి, అక్కన్న పేట నుంచి మెదక్, బొల్లారం నుంచి మనోహరాబాద్ వీటితో పాటు పలు రూట్లలో ఎంఎంటీఎస్ ను విస్తరించాలని సురేష్ ప్రభును కోరానని దత్తాత్రేయ తెలిపారు. మౌలాలి, శేరిలింగంపల్లి లను కొత్త రైల్వే టెర్మినల్ గా గుర్తించాలని కోరినట్టు చెప్పారు. మెదక్-అక్కన్న పేట రైల్వే ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాలని కోరానన్నారు.

మిర్జాపల్లి – మెదక్ కొత్త రైల్వే లైను కేటాయించాలని, నిజామాబాద్‌ – పెద్దపల్లి పనులు చివరికి చేరినందున ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించి రైల్వే పనులు పూర్తి చేయాలని కోరినట్టు దత్తాత్రేయ వెల్లడించారు. లంగాణలోని రైల్వే ప్రాజెక్టుల పట్ల రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. 2016-17 రైల్వే బడ్జెట్ లో సౌత్ సెంట్రల్ రైల్వేకు భారీగా నిధులు వస్తాయని భావిస్తున్నానని దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: