భారత దేశంలో ఎన్డీఏ పాలనలోకి వచ్చిన తర్వాత అభివృద్ది సంక్షేమ పథకాలు, విదేశీ పెట్టుబడులు, వైజ్ఞానిక రంగంలో ఎన్నో మార్పులు చేపడుతు ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది. కేంద్ర బడ్జెట్ సమావేశాలకు తేదీలు ఖరారయ్యాయి. ఇప్పటికే 2016-17 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం చేపడుతున్న ప్రధానమంత్రి కృషి యోజన, రాష్ట్రీయ కృషి సించాయ్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ రహదారుల పథకం, భూసార పరిరక్షణ కార్డులు తదితర పథకాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

దీనికోసం కేంద్ర ఆర్థిక శాఖామంత్రి అరుణ్ జైట్లీ ఆయా శాఖలతో విస్తృత స్థాయిలో సమావేశాలు, చర్చలు జరిపి బడ్జెట్ రూపకల్పన చేసినట్లు తెలుస్తుంది.జీఎస్టీ, రియల్ ఎస్టేట్ లాంటి బిల్లులకు ఈ సమావేశాల్లోనే ఆమోదం లభించేలా చేసి ఏప్రిల్ నుండి చట్టాలను అమలులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.
 
ఈ మేరకు ఫిబ్రవరి 23 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు జరగనుండగా..! ఏప్రిల్‌ 25 నుంచి మే 13 వరకు రెండో విడత సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా.. ఫిబ్రవరి 25న రైల్వే బడ్జెట్‌, 26న ఆర్థిక సర్వే, 29న సాధారణ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: